టాలీవుడ్ సీరియల్ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. చిరంజీవి తనయుడు అయినటువంటి రామ్ చరణ్ ఇప్పటికే సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి చాలా సంవత్సరాలు అవుతుంది. ఎన్నో సినిమాలలో నటించి ఎన్నో విజయాలను అందుకొని చరణ్ ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోలలో ఒకరిగా కెరియర్ను కొనసాగిస్తున్నాడు. ఇకపోతే ఓ విషయంలో చిరు , చరణ్ ఒకే దారి లోనే వెళుతున్నట్లు తెలుస్తోంది. అసలు విషయం లోకి వెళితే ... 2025 వ సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా చిరంజీవి హీరో గా రూపొందుతున్న విశ్వంభర మూవీ ని విడుదల చేయనున్నట్లు మేకర్స్ మొదట ప్రకటించారు. కానీ రామ్ చరణ్ హీరో గా నటించిన గేమ్ చెంజర్ సినిమాని సంక్రాంతి బరిలో నిలపడం కోసం చిరంజీవి నటించిన విశ్వంభర మూవీ ని సంక్రాంతి భరి నుండి తప్పించారు. దానితో చరణ్ హీరోగా రూపొందిన గేమ్ చెంజర్ మూవీ పోయిన సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల అయింది.

ఇది ఇలా ఉంటే ఈ సంవత్సరం మెగాస్టార్ చిరంజీవి హీరోగా రూపొందుతున్న మన శంకర వర ప్రసాద్ గారు సినిమా సంక్రాంతి బరిలో నిలవబోతోంది. ఈ సినిమాను ఈ సంవత్సరం జనవరి 12 వ తేదీన విడుదల చేయనున్నారు. ఇక ప్రస్తుతం రామ్ చరణ్ "పెద్ది" సినిమాలో హీరో గా నటిస్తున్న విషయం మనకు తెలిసిందే. తన తండ్రి హీరోగా రూపొందుతున్న మన శంకర వర ప్రసాద్ గారు సినిమా సంక్రాంతి పండుగకు విడుదల కానున్న నేపథ్యం లో ఆ సినిమాకు సంబంధించి ఎలాంటి డైవర్షన్ తమ అభిమానుల్లో ఉండకూడదు అనే ఉద్దేశంతో పెద్ది సినిమాకు సంబంధించిన ఏ అప్డేట్లను కూడా సంక్రాంతి పండగ వరకు విడుదల చేయకూడదు అని చరణ్ ఫిక్స్ అయినట్లు అందుకే పెద్ది సినిమా నుండి సెకండ్ సింగిల్ను కూడా విడుదల వాయిదా వేసినట్లు తెలుస్తోంది. ఇలా చిరు , చరణ్ ఇద్దరు కూడా ఒకే దారిలో పయనిస్తున్నట్టు చాలా మంది అభిప్రాయ పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: