టాలీవుడ్ ఇండస్ట్రీ లో సీనియర్ నటుడు అయినటువంటి శ్రీకాంత్ కుమారుడు రోషన్ "నిర్మల కాన్వెంట్" అనే సినిమాతో వెండి తెరకు పరిచయం అయ్యాడు. ఈ సినిమా ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేదు. ఆ తర్వాత కాస్త ఎక్కువ గ్యాప్ తీసుకున్న రోషన్ "పెళ్లి సందD" అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు. ఈ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.

మూవీ మంచి విజయం సాధించిన కూడా ఈయన తదుపరి మూవీ కి మళ్ళీ ఎక్కువ గ్యాప్ తీసుకున్నాడు. పెళ్లి సందD సినిమా తర్వాత చాలా కాలానికి ఈయన తాజాగా ఛాంపియన్ అనే మూవీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ మూవీ విడుదలకు ముందు ఈ మూవీ బృందం వారు ఈ సినిమా నుండి విడుదల చేసిన ప్రచార చిత్రాలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. దానితో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఏర్పడ్డాయి. అలా మంచి అంచనాల నడుమ ఈ సినిమా డిసెంబర్ 25 వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ మూవీ కి విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే ప్రేక్షకుల నుండి కాస్త మిక్స్ డ్ టాక్ వచ్చింది. దానితో ఈ మూవీ కి మంచి ఓపెనింగ్స్ లభించిన ఆ తర్వాత నుండి ఈ సినిమా కలెక్షన్స్ చాలా వరకు డ్రాప్ అయ్యాయి. ఈ మూవీ కలెక్షన్లు డ్రాప్ అయినా కూడా ఈ మూవీ కి ఇప్పటివరకు మంచి కలెక్షన్స్ దక్కాయి.

ఇప్పటివరకు ఈ సినిమాకు సంబంధించిన ఎనిమిది రోజుల బాక్సా ఫీస్ రన్ కంప్లీట్ అయింది. ఈ ఎనిమిది రోజుల్లో ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా 7.15 కోట్ల రేంజ్ లో షేర్ ... 14.10 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్లు దక్కాయి. ఈ మూవీ దాదాపు 11 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బాక్సా ఫీస్ బరి లోకి దిగింది. దానితో ఈ సినిమా మరో నాలుగు కోట్ల వరకు షేర్ కలెక్షన్లను వసూలు చేస్తే హిట్టు స్టేటస్ను అందుకుంటుంది. మరి ఈ సినిమా హిట్ స్టేటస్ ను అందుకుంటుందా లేదా అనేది చూడాలి. ఏదేమైనా కూడా ఈ మూవీ కి మిక్స్ డ్ టాక్ వచ్చిన మంచి కలెక్షన్లనే ఈ మూవీ బాక్సా ఫీస్ దగ్గర రాబడుతుంది అని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: