ఆమని హీరోయిన్‌గా ఫామ్‌లో ఉన్నప్పుడు చిరంజీవి నటించిన 'రిక్షావోడు' (Rikshavodu) సినిమాలో ఆమెను హీరోయిన్‌గా ఎంపిక చేశారట. మొదట ఈ చిత్రానికి దర్శకుడు ఏ. కోదండరామిరెడ్డి గారు అనుకున్నారు. ఆయన ఆమనిని హీరోయిన్‌గా ఫైనల్ చేసి, డేట్స్ కూడా తీసుకున్నారు. చిరంజీవికి వీరాభిమాని అయిన ఆమని, ఈ ఆఫర్ రావడంతో ఎంతో సంతోషపడి చిరంజీవి గారికి ఫోన్ చేసి తన ఆనందాన్ని కూడా పంచుకున్నారట.అయితే, కొన్ని కారణాల వల్ల కోదండరామిరెడ్డి స్థానంలో దర్శకుడు కోడి రామకృష్ణ గారు ప్రాజెక్టులోకి వచ్చారు. దర్శకుడు మారడంతో సినిమాలోని నటీనటుల ఎంపిక కూడా మారింది. అలా ఆమని స్థానంలో నగ్మా ను హీరోయిన్‌గా తీసుకున్నారు.ఈ విషయం తెలిసి ఆమని ఎంతో కుంగిపోయారట. తన డ్రీమ్ హీరో పక్కన నటించే అవకాశం చివరి నిమిషంలో చేజారిందని ఆమె ఇప్పటికీ బాధపడుతుంటారు.
హీరోయిన్‌గా ఛాన్స్ మిస్ అయిన కొన్నాళ్ల తర్వాత, మళ్ళీ చిరంజీవి సినిమాలోనే ఆమనికి మరో అవకాశం వచ్చింది. కానీ అది హీరోయిన్ పాత్ర కాదు. 'స్టాలిన్' (Stalin) సినిమాలో చిరంజీవికి సోదరి (చెల్లెలు) పాత్ర కోసం చిత్ర యూనిట్ ఆమనిని సంప్రదించింది.ఆమని ఈ ఆఫర్‌ను నిర్మొహమాటంగా తిరస్కరించారు. "చిరంజీవి గారు నా డ్రీమ్ హీరో. ఆయనను నా గది నిండా పోస్టర్లు అతికించుకుని ఆరాధించేదాన్ని. అలాంటి వ్యక్తికి చెల్లెలిగా నేను నటించలేను. నటిస్తే హీరోయిన్‌గానే నటించాలి లేకపోతే అసలు నటించను" అని ఆమె తేల్చి చెప్పారు. యూనిట్ సభ్యులు పది సార్లు ఫోన్ చేసి అడిగినా ఆమె తన నిర్ణయాన్ని మార్చుకోలేదట.
ఆమని తన కెరీర్‌లో బాలకృష్ణ, నాగార్జున వంటి స్టార్ హీరోలతో నటించినప్పటికీ, చిరంజీవితో నటించలేకపోవడం ఒక తీరని లోటుగా మిగిలిపోయింది. అయితే, ఇటీవల ఒక సందర్భంలో ఆమె చిరంజీవి గారితో ఫోటో దిగి తన చిన్ననాటి కోరికను నెరవేర్చుకున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి