ఇండియా హెరాల్డ్ గ్రూప్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి....కొత్తిమీర ఎంత రుచికరమైన పదార్ధమో వేరే చెప్పాల్సిన పని లేదు. మనం చేసుకునే కూరలలో కొత్తిమీర కలిపితే ఆ రుచి వర్ణనాతీతం. కూరకి అంత రుచి వస్తుంది కొత్తిమీరతో. ఇకకొత్తి మీర కేవలం రుచికే కాదు సౌందర్యానికి కూడా చాలా మంచిది. కొత్తిమీరతో ముఖానికి సంబంధించిన అనేక సమస్యలు తగ్గి ముఖం చాలా అందంగా కాంతివంతంగా తయారవుతుంది...


ముఖం మీద నుండి జిడ్డుని అబ్జార్బ్ చేసే లక్షణం కొత్తిమీర కి ఉంది. కొత్తిమీర ఆకుల్లో యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఫంగల్, యాంటీ సెప్టిక్, డిస్ఇంఫెక్టెంట్ ప్రాపర్టీస్ ఉన్నాయి. ఇవి అనేక రకాల చర్మ సమస్యల నుండి రిలీఫ్ ని ఇస్తాయి. ఈ ఆకుల్లో ఉండే విటమిన్స్ ఈ చర్మాన్ని మృదువుగా చేస్తుంది. తాగా కొత్తిమీర రసాన్ని ఫేస్ మీద డైరెక్ట్ గా అప్లై చేయండి. గంట తరువాత కడిగేయండి. లేదంటే కొత్తిమీర ఆకులూ, పాలు కలిపి థిక్ పేస్ట్ లా కూడా చేయవచ్చు. ఈ పేస్త్ ని ముఖానికి పట్టించి పట్టించి పదిహేను నిమిషాల తరువాత కడిగేయండి.యాక్నే, బ్లాక్ హెడ్స్ తొలగించుకోవడానికి మీరు ఎలాంటి క్రీములు వాడాల్సిన పని లేదు. మీకు కావలసిందల్లా తాజా కొత్తిమీర, అంతే. కొత్తిమీర ఆకుల పేస్ట్, నిమ్మరసం యాక్నే, బ్లాక్ హెడ్స్ నుండి రిలీఫ్ ని ఇస్తాయి. ఒక టీ స్పూన్ కొత్తి మీర ఆకుల పేస్ట్ తీసుకోండి. అందులో ఒక టీ స్పూన్ నిమ్మ రసం కలపండి. సమస్య ఉన్న చోట ఈ మిశ్రమంతో మసాజ్ చేసి ఒక గంట తరువాత చల్లని నీటితో కడిగేయండి.



ఇక కొంతమందికి యుక్త వయస్సులోనే ముఖంపై ముడతలు వస్తాయి..వయసు పెరగడం మానదు, కానీ అది ముఖం మీద కనబడకుండా వుండే ఈ విషయం లో కొత్తిమీర ఆకులు చాలా బాగా హెల్ప్ చేస్తాయి. ఇవి ఫ్రీ రాడికల్స్ తో ఫైట్ చేసి పిగ్మెంటేషన్, రింకిల్స్, లూజ్ స్కిన్ వంటి అనేక స్కిన్ ప్రాబ్లమ్స్ ని ప్రివెంట్ చేస్తాయి. కొత్తిమీర ఆకులూ, అలోవెరా జెల్ కలిపి పేస్ట్ లా చేయండి. ఈ పేస్ట్ ని ముఖానికి అప్లై చేసి పదిహేను నిమిషాల తరువాత కడిగేయండి.పెదవుల మీద నుండి డెడ్ సెల్స్ ని రిమూవ్ చేసి మీ లిప్స్ చక్కగా మెరుస్తూ ఉండేలా చేస్తుంది కొత్తిమీర. రెండు టీ స్పూన్ల కొత్తిమీర జ్యూసులో ఒక టీ స్పూన్ నిమ్మ రసం కలపండి. రోజూ రాత్రి నిద్ర కి ముందు పెదవులకి అప్లై చేసి పడుకోండి. ఇలా కనీసం ఒక వారం పాటు చేయండి.ఇక ఇలాంటి మరెన్నో సౌందర్య చిట్కాల కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో సౌందర్య చిట్కాల గురించి తెలుసుకోండి....

మరింత సమాచారం తెలుసుకోండి: