
ఇటీవల కాలంలో అనేక మందికి ఎదురవుతున్న సమస్య జుట్టు రాలడం. అయితే ఈ సమస్య నుంచి బయటపడాలంటే ఈ ఆహారాన్ని మానేస్తే మంచిది అంటున్నారు నిపుణులు. మనం తీసుకునే ఆహారం వల్ల మనకు అందం, ఆరోగ్యం రెండూ వస్తాయి. చర్మ సౌందర్యం మరియు జుట్టుకు అవసరమైన పోషకాలను అందించేది ఆహారం. అయితే మీ జుట్టు అకస్మాత్తుగా రాలితే మీరు తినే ఆహారంలో కొన్ని పోషకాలు లేకపోవడమే అని చెప్పవచ్చు.
1). చక్కెర : మీకు జుట్టు రాలడం ప్రారంభం అయితే చక్కెరను బాగా తగ్గించండి. కుదిరితే చక్కెరను తీసుకోవడం మానేయండి.
2). అధిక గ్లైసెమిక్ కలిగిన ఆహార పదార్థాలు ఎక్కువగా తీసుకోవడం వల్ల జుట్టు రాలడానికి ప్రధాన కారణం అని చెప్పవచ్చు. శుద్ధ పిండి, రొట్టె మరియు చక్కెర చాలా ఎక్కువ గ్లైసెమిక్ సూచిక ను కలిగి ఉంటుంది. ఇలాంటి వాటిని ఎక్కువగా తీసుకోవడం వల్ల జుట్టు రాలడానికి కారణమవుతాయి.
3). ఆల్కహాల్ జుట్టుకు చాలా ప్రమాదకరం. ఆల్కహాల్ ప్రొటీన్లను బలహీనపరుస్తుంది. దీంతో జుట్టు అధికంగా రాలిపోవడం జరుగుతుంది.
4). జంక్ ఫుడ్ లో ఉన్న శాచురేటెడ్ వంటి రకాల పేర్లతో ఊబకాయం రావడమే కాదు, గుండెజబ్బులు వంటి ఆరోగ్య సమస్యలకు కూడా కారణం అవుతుంది. ఇది ఇందులో భాగంగానే జుట్టు కూడా ఊడిపోతుంది. నూనెలు ఎక్కువగా ఉన్న పదార్థాలు రోజు తినడం వల్ల కూడా మీ జుట్టు రాలడం తారస్థాయికి చేరుతుంది.
5). కోడిగుడ్ల లో ఉన్న ప్రోటీన్ వెంట్రుకలకు చాలా మంచిది. కానీ పచ్చి ఎగ వైట్ తీసుకోవడం వల్ల బయోటిన్ లోపం ఏర్పడుతుంది. సాధారణంగా బయోటిన్ అనే విటమిన్ కు సహకరిస్తుంది. కానీ పచ్చి గుడ్ల సొన తాగడంతో బయోటిన్ లోపం తలెత్తి, జుట్టుకు పోషణ తగ్గి, జుట్టు రాలడం జరుగుతుంది.
6). చేపల్లో అత్యధికంగా ఉన్న పాదరసం నిలువల కారణంగా చేపలు ఎక్కువగా తినేవారిలో కొందరికి ఉన్నట్టుండి జుట్టు ఊడిపోతుంది. కానీ కొన్ని చేపల వల్ల వెంట్రుకలు బాగా పెరుగుతాయి. కానీ మీరు ఎలాంటి చేపలు తింటారు అనే దానిపై ఆధారపడి ఉంటుంది.