ప్రస్తుతం పొడవాటి జుట్టు ఉన్న స్త్రీలు వారి జుట్టును జాగ్రత్తగా కాపాడుకోవటం ప్రస్తుతం కొంచెం కష్టంగా మారుతుంది. అటువంటి పరిస్థితిలో జుట్టును సంరక్షించుకోవాడానికి చాలా ఉత్పత్తులు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. కానీ ఈ ఉత్పత్తులు ఆశించిన ఫలితాన్ని అసలు ఇవ్వలేకపోతున్నాయి. అయితే ఆరోగ్య నిపుణులు సూచించిన ప్రకారం..ఇంట్లో ఉండే వస్తువులతో జుట్టును చాలా ఈజీగా రక్షించుకోవచ్చని తెలుపుతున్నారు. ఇంట్లో ఉండే ఉల్లిపాయను ఉపయోగించి జుట్టు సమస్యలను చాలా ఈజీగా తగ్గించుకోవచ్చు. అంతే కాకుండా ఉల్లిపాయలో ఉండే గుణాలు జుట్టుకు చాలా మేలుని కూడా చేస్తాయి.ఉల్లిపాయతో ఇలా చేస్తే జుట్టు ఇక రాలదు.ఇక దీనిని ఉపయోగించి జుట్టును ఎలా రక్షించుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం...



ఇక దీనిని ఎలా తయారు చేసుకోవాలి అంటే..ముందుగా ఉల్లిపాయను తీసుకొని దానిని తురుముకొని దాని రసాన్ని తీయండి. మీరు కావాలంటే ఉల్లిపాయను మిక్సర్ గ్రైండర్లో కూడా రుబ్బుకొని రసాన్ని తీయోచ్చు. ఇక దీని తర్వాత మీరు ఆ రసంలో ఒక టెబుల్‌ స్పూన్‌ నిమ్మరసాన్ని పోయాలి. అంతే కాకుండా ఒక విటమిన్ ఇ క్యాప్సూల్‌లోని మిశ్రమాన్ని కూడా అందులో పోయాలి. ఇప్పుడు దీనిని ఓ స్ప్రే బాటిల్‌లో వేసి మీ జుట్టుకి వాడండి.ఇక మీరు దీనిని రాత్రి పడుకునే ముందు వెంట్రుకలకు ఈ స్ప్రేని ఉపయోగించడం చాలా మంచిది. ఈ మిశ్రమాన్ని ఉపయోగించే ముందు మీ జుట్టు బాగా పొడిగా ఉండాలి. దీనిని ఉపయోగించిన తర్వాత నూనెతో బాగా మసాజ్ చేయండి. ఉదయం లేచిన తర్వాత తేలికపాటి చేతులతో జుట్టుకు బాగా మసాజ్ చేసి ఆపై జుట్టును కడగాలి.ఇక ఉల్లిపాయ రసాన్ని ఉపయోగించడం ద్వారా మీ జుట్టును చాలా దృఢంగా మార్చుకోవచ్చు. జుట్టు రాలే సమస్యలను కూడా చాలా ఈజీగా తగ్గిస్తుంది. అయితే మీరు స్కాల్ప్‌ ఇన్ఫెక్షన్‌తో కనుక బాధపడుతూ ఉంటే దీనిని అప్లై చేయకపోవటం చాలా మంచిది.

మరింత సమాచారం తెలుసుకోండి: