చాలా మందికి కూడా అసలు సీజన్ తో పని లేకుండా తరచూ పెదాలు ఎక్కువగా పగిలిపోతుంటాయి. పెదాల పగుళ్లు కారణంగా ఏమైన తినేటప్పుడు మంట తగిలితే తీవ్రమైన నొప్పికి గురవుతుంటారు.అలాగే ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు చాలా అసౌకర్యంగా ఫీల్ అవుతుంటారు. ఈ క్రమంలోనే పెదాల పగుళ్లును తగ్గించుకోవడం కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ముప్ప తిప్పలు పడుతుంటారు. ఈ జాబితాలో మీరు ఉంటే అస్సలు బాధ పడకండి. ఎందుకంటే ఇప్పుడు చెప్పబోయే హోమ్  లిప్ క్రీమ్ ను వాడితే పెదాల పగుళ్లను చాలా ఈజీగా ఇంకా శాశ్వతంగా వదిలించుకోవచ్చు.ఈ క్రీమ్ ను వాడటం వల్ల మీ పెదాలు చాలా మృదువుగా ఇంకా అందంగా మారతాయి. ఇక ఈ లిప్ క్రీమ్ ను ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. ముందుగా ఒక బౌల్ ను తీసుకుని అందులో ఒక టేబుల్ స్పూన్ బటర్, ఒక టేబుల్ స్పూన్ వాసెలిన్, ఒక టేబుల్ స్పూన్ షుగర్ వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి.


ఇప్పుడు ఈ గిన్నెను మరుగుతున్న నీటిలో రెండు నిమిషాల పాటు ఉంచి వేడి చేయాలి. ఆ తర్వాత అందులో చిటికెడు పసుపు ఇంకా హాఫ్ టేబుల్ స్పూన్ స్వీట్ ఆల్మండ్ ఆయిల్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. అంతే మన లిప్ క్రీమ్ రెడీ అయినట్టే. ఇక ఈ క్రీమ్ ను ఒక బాక్స్ లో నింపుకొని ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకోవాలి. రోజుకు రెండు నుంచి మూడు సార్లు ఈ క్రీమ్ ను పెదాలకు అప్లై చేస్తే  పెదాల పగుళ్ళు ఈజీగా మాయం అవుతాయి. ఇంకా అదే సమయంలో పెదాలు చాలా మృదువుగా మారతాయి. ఇంకా అలాగే పెదాల నలుపును వదిలించడానికి కూడా ఈ హోమ్ మేడ్ లిప్ క్రీమ్ ఎంతగానో సహాయపడుతుంది. రెగ్యులర్ గా ఈ క్రీమ్ ను వాడితే ఖచ్చితంగా కొద్ది రోజుల్లోనే నల్లగా ఉన్న పెదాలు గులాబీ రంగులోకి మారతాయి.కాబట్టి ఖచ్చితంగా ఈ హోమ్ మేడ్ టిప్ ని మీరు కూడా ట్రై చెయ్యండి. ఖచ్చితంగా చాలా మంచి ఫలితాలని మీరు పొందుతారు.

మరింత సమాచారం తెలుసుకోండి: