మనం ఎండలో తిరగడం వల్ల చర్మం నల్లగా మారుతూ ఉంటుంది. అయితే ఈ ఎండ నుండి, యువి కిరణాల నుండి చర్మం తనని తాను రక్షించుకోవడానికి మెలనిన్ ను ఎక్కువగా ఉత్పత్తి చేస్తుంది.అందువల్ల చర్మం నల్లగా మారిపోతూ ఉంటుంది.ఇంకా చర్మంపై ట్యాన్ పేరుకుపోవడంతో పాటు చర్మం కూడా కమిలిపోతూ ఉంటుంది. కాబట్టి వీలైనంత తక్కువగా బయట తిరగాలి.అలాగే చర్మంపై నేరుగా ఎండ పడకుండా చూసుకోవాలి. యువి కిరణాల వల్ల చర్మం దెబ్బతినకుండా చూసుకోవాలి.ఎండలో తిరగడం వల్ల చర్మం నల్లగా మారడంతో పాటు చర్మం బాగా పొడిబారుతుంది. కాబట్టి చర్మాన్ని ఎల్లప్పుడూ తాజాగా, తేమ ఉండేలా చూసుకోవాలి.ఇంకా అలాగే చాలా మంది ముఖంపై ఏర్పడిన ట్యాన్ ను తొలగించుకోవడానికి చర్మాన్ని తిరిగి సాధారణ రంగుకు తీసుకురావడానికి చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు.
చాలా మంది ఎండలో తిరగాల్సి వచ్చినప్పుడు సన్ స్క్రీన్ లోషన్స్ ఎక్కువగా వాడుతూ ఉంటారు.అయితే వీటిని వాడినా కానీ చర్మం నల్లగా మారిపోతూ ఉంటుంది. అయితే వీటికి బదులుగా ఇప్పుడు చెప్పే టిప్ ని పాటించడం వల్ల ఎండ వల్ల నల్లగా మారిన చర్మం తిరిగి సాధారణ స్థితికి వస్తుంది. ఇంకా అలాగే చర్మం తాజాగా, తేమగా ఉంటుంది.ఇక ఈ టిప్ ని తయారు చేసుకోవడానికి గానూ మనం టమాటను, నిమ్మరసాన్ని ఇంకా పేస్ట్ ను ఉపయోగించాల్సి ఉంటుంది. ఒక గిన్నెలో టమాట రసం, నిమ్మరసం ఇంకా తెల్లని పేస్ట్ వేసి బాగా కలపాలి. ఆ తరువాత ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించాలి. దీనిని అరగంట పాటు అలాగే ఉంచిన తరువాత చల్లటి నీటితో బాగా శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల చర్మంపై పేరుకుపోయిన నలుపుదనం అంతా తొలగిపోతుంది. ఈ టిప్ ని వారానికి రెండు సార్లు పాటించడం వల్ల ఎండ వల్ల చర్మం దెబ్బతినకుండా ఉంటుంది. ఇంకా అలాగే ఎండ వల్ల నల్లగా మారిన చర్మం తిరిగి సాధారణ రంగుకు వస్తుంది.
మరింత సమాచారం తెలుసుకోండి: