మన ఆరోగ్యంగా, అందంగా ఉంటేనే మన జుట్టు  ఊడిపోకుండా చాలా బలంగా ఉంటుంది. ఒకవేళ జుట్టు ఊడిపోయినప్పటికీ.. వాటి స్థానంలో మళ్లీ కొత్త జుట్టు వస్తుంది. జుట్టు కుదుళ్లు బలహీన పడటం వల్ల లేదా దెబ్బతినడం వల్ల ఊడిన జుట్టు స్థానంలో మళ్ళీ కొత్త జుట్టు రాకుండా పోతుంది.మన జుట్టు ఆరోగ్యం అంతా కూడా జుట్టు కుదళ్లపైనే ఆధారపడి ఉంటుంది. కాబట్టి జుట్టు కుదుళ్లను బలపరిచే చర్యలు తీసుకోవాలి.జుట్టు కుదుళ్లు బలంగా ఉండాలంటే.. రక్త ప్రసరణ కూడా బాగా జరగాలి.జుట్టుకు రక్త ప్రసరణ ఎక్కువగా జరగాలంటే ఖచ్చితంగా శరీరంలో తగినంత రక్తం ఉండటం చాలా అవసరం.ఎందుకంటే రక్త ప్రసరణ సరిగ్గా ఉంటేనే జుట్టు కుదుళ్లకు పోషకాలు అనేవి ఎక్కువగా అందుతాయి.అలాగే జుట్టు కుదుళ్లలో ఉండే వ్యర్థాలు కూడా తొలగించబడతాయి. శరీరంలో రక్తాన్ని పెంచడంతో పాటు ఆరోగ్యంగా ఉండాలంటే ఖచ్చితంగా విటమిన్లు, మినరల్స్ ఎక్కువగా ఉండే ఆహారాలు తినాలి.స్త్రీలు ఎక్కువగా ఆకు కూరలను పప్పులతో వండుకుని తినడం వల్ల వారిలో రక్త హీనత అనేది తగ్గుతుంది.


 రక్త హీనత కారణంగా జుట్టు రాలి పోతుంది. ఆకు కూరలు తినడం వల్ల కేవలం జుట్టు సమస్యలే కాకుండా.. ఇతర ఆరోగ్య సమస్యలు కూడా మెరుగు పడతాయి. అదే విధంగా రాజ్మా, సోయా, నానబెట్టిన పుచ్చ గింజలు, డ్రైఫ్రూట్స్ కూడా జుట్టు బలంగా ఉండేందుకు సహయ పడతాయి.విటమిన్స్, మినరల్స్ ఎక్కువగా ఉండే పోషకాల్లో ఆకు కూరాలు కూడా ఒకటి. గోంగూర, బచ్చలి కూర, పాల కూర, తోట కూర, మెంతి కూర, పొన్న గంటి కూర వంటి ఆకు కూరలు రోజూ ఆహారంలో భాగంగా తీసుకోవాలి. కంది పప్పు, పెసరపప్పు వంటి వాటితో కూడా కలిపి ఆకు కూరలు తినొచ్చు. ఆకు కూరలు తినడం వల్ల ఐరన్, ప్రోటీన్స్, విటమిన్స్ ఇ, కె వంటి పోషకాలు జుట్టుకు అందుతాయి. దీని వల్ల కుదుళ్లు స్ట్రాంగ్‌గా ఉంటాయి. రోజూ ఆకు కూరలు వండుకుని తినడం వల్ల జుట్టు కుదుళ్లకు కావాల్సిన పోషకాలన్నీ అందుతాయి. దాంతో జుట్టు కుదళ్లు బలంగా తయారవుతాయి. దీంతో జుట్టు రాలడం తగ్గుతుంది. జుట్టు రాలినా కూడా మళ్లీ కొత్త జుట్టు వస్తుంది.కాబట్టి ఖచ్చితంగా ఈ టిప్స్ పాటించండి. జుట్టు ఆరోగ్యాన్ని కాపాడుకోండి.

మరింత సమాచారం తెలుసుకోండి: