జుట్టు రాలే సమస్య ఈ రోజుల్లో చాలా కామన్ అయిపోయింది.ప్రస్తుతం ఈ సమస్య ప్రతి ఒక్కరినీ కూడా ఎంతగానో వేధిస్తోంది. జుట్టు ఎక్కువగా దువ్వుతున్నప్పుడు చేతినిండా జుట్టు వస్తుంది. అందుకు వేలకొద్దీ చికిత్సలు చేసినా ఫలితం కనిపించదు.రోజులు గడిచే కొద్దీ తల ముందు భాగంలో బట్టతల అనేది బాగా పెరుగుతుంది. ఇది ఖచ్చితంగా మరింత ఒత్తిడికి దారి తీస్తుంది. కాబట్టి జుట్టుకు అదనపు జాగ్రత్త అనేది చాలా అవసరం.జుట్టు రాలడాన్ని నివారించడంలో ఉల్లిపాయ సహాయపడుతుంది. జుట్టు రాలకుండా ఉండేందుకు చాలా మంది ఉల్లిపాయ రసాన్ని అప్లై చేస్తుంటారు. దానితోపాటు కరివేపాకు కూడా కలిపితే మంచి ఫలితం ఉంటుంది. దీని కోసం ముందుగా కరివేపాకును గ్రైండర్‌లో వేసి పేస్ట్ చేసుకోవాలి. ఈ పేస్ట్‌ను ఒక గిన్నెలోకి తీసుకుని ఉల్లిపాయ రసంతో కలపాలి. ఈ మిశ్రమాన్ని జుట్టుకు పట్టించి, 30 నిమిషాల పాటు అలాగే ఉంచి.. తర్వాత షాంపూ చేసుకోవాలి.కరివేపాకు ఆకులను పెరుగుతో కలిపి జుట్టుకు అప్లై చేసినా కూడా ఫలితం ఉంటుంది.


ఈ రెండు పదార్థాలు జుట్టుకు చాలా మేలు చేస్తాయి. ఈ హెయిర్ ప్యాక్ తయారు చేయడం చాలా సులభం. ఒక గిన్నెలో పెరుగు తీసుకుని, కరివేపాకు పేస్తుతో కలపాలి. ఈ మిశ్రమాన్ని కలిపి జుట్టుకు పట్టించాలి.కరివేపాకుతో ఉసిరికాయ, మెంతికూర కలిపి జుట్టుకు అప్లై చేస్తే అద్భుతమైన ఫలితాలు కనిపిస్తుంది. ఇందుకోసం ఉసిరికాయ రసం, మెంతి ఆకు ముద్దను ఒక గిన్నెలోకి తీసుకోవాలి. దానికి కరివేపాకు రసం కలపాలి. తర్వాత ఈ పేస్ట్‌ని జుట్టుకు అప్లై చేయాలి.రోజుకు 100 వెంట్రుకలు రాలడం సాధారణం. కానీ అంతకంటే ఎక్కువ సంఖ్యలో వెంట్రుకలు రాలితే మాత్రం సమస్యగా పరిగణించాలి. అధికంగా జుట్టు రాలడం చివరికి బట్టతలకి దారితీస్తుంది.ఈ సమస్య నుంచి ఉపశమనం కలిగించడానికి కరివేపాకు ఉపయోగపడుతుంది.కాబట్టి ఖచ్చితంగా ఈ టిప్స్ పాటించండి. జుట్టు రాలే సమస్య నుంచి ఈజీగా ఉపశమనం పొందండి. అయితే ఈ టిప్స్ క్రమం తప్పకుండా పాటించాలి. అప్పుడే ఖచ్చితంగా సరైన ఫలితం ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: