పొద్దు తిరుగుడు గింజల పప్పు  ఆరోగ్యానికి అందానికి చాలా రకాలుగా మేలు చేస్తుంది. ఒక 100గ్రాముల పొద్దుతిరుగుడు గింజలపప్పులో 556 క్యాలరీల శక్తి ఉంటుంది. అలాగే 18 నుండి 20 శాతం ప్రోటీన్ ఉంటుంది. అలాగే వీటిలో ఇతర గింజల కంటే విటమిన్ ఇ ఎక్కువగా ఉంటుంది. 100గ్రాముల పొద్దుతిరుగుడు గింజలల్లో 35 మిల్లీగ్రాముల విటమిన్ ఇ ఉంటుంది.జుట్టు, చర్మం ఆరోగ్యంగా అందంగా ఉండాలనుకునే వారు ఇంకా అలాగే త్వరగా వృద్దాప్య ఛాయలు దరి చేరకుండా ఉండాలనుకునే వారు పొద్దుతిరుగుడు గింజలను తీసుకోవడం చాలా రకాలుగా మంచిది. అలాగే గుమ్మడి గింజల పప్పు కూడా చాలా మంచిది. ఎందుకంటే 100గ్రాముల గుమ్మడి గింజలపప్పులో 570 క్యాలరీల శక్తి, 30శాతం ప్రోటీన్ ఉంటుంది. ఇంకా అలాగే ఈ గింజలల్లో జింక్ ఎక్కువగా ఉంటుంది. మన శరీరానికి 7 మైక్రో గ్రాముల జింక్ అవసరమవుతుంది. కానీ గుమ్మడి గింజలల్లో 7.7 నుండి 8 మైక్రోగ్రాముల జింక్ ఉంటుంది. మెదడు చురుకుగా పని చేయడానికి, మేధాశక్తికి, తెలివితేటలు పెరగడానికి జింక్ చాలా అవసరం. 


గుమ్మడి గింజలను తీసుకోవడం వల్ల మన శరీరానికి కావల్సినంత జింక్ లభిస్తుంది.ఇంకా అలాగే పుచ్చగింజల పప్పు కూడా ఆరోగ్యానికి మంచిది. దీనిని స్వీట్ లలో, వంటలల్లో  ఎక్కువగా వాడుతూ ఉంటారు. ఇవి తక్కువ ధరలో మనకు లభిస్తాయి. అలాగే 100గ్రాముల పుచ్చగింజల పప్పులో 628 క్యాలరీల శక్తి ఉంటుంది. జీడిపప్పు, పిస్తా పప్పు కంటే వీటిలో శక్తి ఎక్కువగా ఉంటుంది. అలాగే పుచ్చగింజల పప్పులో మిగిలిన వాటి కంటే ఎక్కువగా దాదాపు 34 శాతం ప్రోటీన్ ఉంటుంది. మేక మాంసం, కోడి మాంసం కంటే కూడా ఇందులో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. కనుక పుచ్చగింజల పప్పును నానబెట్టి తీసుకోవడం వల్ల ప్రోటీన్, శక్తితో పాటు మన ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు కలుగుతుంది.  వీటిని తీసుకోవడం వల్ల శరీరంలో చెడు కొలెస్ట్రాల్ తగ్గి మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుందని అలాగే వీటిని తీసుకోవడం వల్ల మనం ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను చాలా సులభంగా మనం పొందవచ్చు. కాబట్టి ఖచ్చితంగా వీటిని తీసుకోండి. ఎల్లప్పుడూ ఆరోగ్యంగా అందంగా ఉండండి.

మరింత సమాచారం తెలుసుకోండి: