ఏప్రిల్ 5వ తేదీన చరిత్రలోకి వెళితే  ఎంతో మంది ప్రముఖులు జననాలు జరిగాయి . మరొక్కసారి హిస్టరీ లోకి వెళ్లి  నేడు జన్మించిన ప్రముఖులు ఎవరో తెలుసుకుందాం రండి . 

 

 రాహుల్ సాంకృత్యాయన్ జననం  : రచయిత చరిత్రకారుడు కమ్యూనిస్టు నాయకుడు రాహుల్ సాంకృత్యాయన్ 1893 ఏప్రిల్ 9వ తేదీన జన్మించారు. హిందీ యాత్ర సాహిత్య పితామహుడుగా  ఆయన సుపరిచితులు. బహుభాషావేత్త బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన ఈయన... వైవిధ్యభరితమైన జీవితాన్ని జీవించారు. తన జీవితంలో నలభై ఐదేళ్ల కాలాన్ని  యాత్రలోనే గడిపారు ఈయన. భారత జాతీయోద్యమంలో కూడా ఎనలేని కృషి చేశారు. భారత జాతీయోద్యమంలో కీలక పాత్ర వహిస్తూ బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా ఎన్నో రచనలు గీతాలు రాసి ప్రజల్లో చైతన్యం కల్పించి  స్వతంత్ర కాంక్ష రగిలించారు . పురాతన బౌధ్ధ గ్రంథాలను వెలికితీసి వాటిని అనువదించి ప్రజలకు అందించడంలో ఎనలేని కృషి చేశారు రాహుల్ సాంకృత్యాయన్. 

 

 మన్నవ బాలయ్య జననం : ప్రముఖ సినీ నటుడు 350కి పైగా చిత్రాల్లో విభిన్నమైన పాత్రల్లో నటించి తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు మన్నవ  బాలయ్య. 1930 ఏప్రిల్ 9వ తేదీన జన్మించారు ఈయన . కళాశాల విద్యను అభ్యసిస్తున్న అప్పటినుంచే నాటక రంగంపై అధిక ఆసక్తి కనబరచిన ఈయన... స్నేహితుల ప్రోద్బలంతో నాటకరంగం వైపు అడుగులు వేశారు. అప్పటి కాలంలో ఎన్నో విభిన్నమైన పాత్రల్లో నటించి తన నటనతో ఎంతో మంది ప్రేక్షకుల అభిమానాన్ని చొరగొన్నారు. అలనాటి సూపర్ స్టార్స్ అయిన అక్కినేని నాగేశ్వరావు, నందమూరి తారకరామారావు లాంటి హీరోల సినిమాల్లో కూడా నటించి మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. అంతే కాకుండా ఎన్నో ధారావాహికలో కూడా నటించారు ఈయన. 

 

 

 జయాబచ్చన్ జననం  : భారతీయ చలనచిత్ర నటి రాజకీయ నాయకురాలు అయిన జయాబచ్చన్ 1948 ఏప్రిల్ 9వ తేదీన జన్మించారు. బాలీవుడ్ లో ఎన్నో సినిమాల్లో నటించి తన వైవిధ్యమైన నటనతో ఎంతగానో ప్రశంసలు అందుకుంది జయ బచ్చన్ . ఆ తర్వాత బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ ను పెళ్లి చేసుకుంది. వీరిద్దరికీ ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఒకరు శ్వేత నంద  బచ్చన్ ఇంకొకరు అభిషేక్ బచ్చన్ . చిత్ర పరిశ్రమకు ఆమె చేసిన సేవలకు గాను పద్మశ్రీ అవార్డును సైతం అందుకున్నారు జయ బచ్చన్ . 

 

 

 కలర్స్ స్వాతి జననం : బుల్లితెర వ్యాఖ్యాత గా కెరీర్ ప్రారంభించిన కలర్స్ స్వాతి ఆ తర్వాత తెలుగు చిత్ర పరిశ్రమలో హీరోయిన్ ఎంట్రీ ఇచ్చిన తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించింది. స్వాతి రెడ్డి 1987 ఎపిసోడ్ 9వ తేదీన జన్మించారు. ఫస్ట్ అష్టా చెమ్మా  అనే సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన స్వాతి తర్వాత ఎన్నో సినిమాల్లో నటించి కుర్రకారును అలరించి మతి పోగొట్టింది. కలర్స్  అనే ప్రోగ్రాం ద్వారా బుల్లి తెర పైకి ఎంట్రీ ఇవ్వడం వల్ల  స్వాతి రెడ్డి ప్రస్తుతం కలర్స్ స్వాతి గా మారిపోయింది. ఇప్పటికే ఎన్నో సినిమాల్లో తనదైన నటనతో ఆకట్టుకుంటూ ప్రేక్షకులను అలరిస్తుంది స్వాతి.

మరింత సమాచారం తెలుసుకోండి: