షమ్మీ కపూర్ సరసన మన్మోహన్ దేశాయ్ దర్శకత్వం వహించిన "బ్లఫ్ మాస్టర్" ఆమెకు మంచి సక్సెస్ ను ఇచ్చింది. "జుక్ గయా అస్మాన్", "ఆయి మిలన్ కీ బేలా", రాజేంద్ర కుమార్ "ఏప్రిల్ ఫూల్", బిశ్వజీత్ "ఏవో ప్యార్ కరెన్", జాయ్ ముఖర్జీతో "షాగీర్డ్", దేవ్ ఆనంద్‌తో కలిసి "ప్యార్ మొహబ్బత్" వంటి చిత్రాలతో అద్భుతమైన హిట్ లను సాధించారు.
ఆమె సూపర్ స్టార్ దిలీప్ కుమార్‌ను వివాహం చేసుకుంది. బాను, దిలీప్ కుమార్ ల వివాహం అక్టోబర్ 11, 1966లో జరిగింది. వివాహ సమయంలో బాను వయస్సు 22 మరియు కుమార్ వయస్సు 44 సంవత్సరాలు. ఈ దంపతులకు పిల్లలు లేరు. భాను పెళ్లి తరువాత కూడా సినిమాల్లో నటించారు. రాజేంద్ర కుమార్ సరసన వచ్చిన అమన్ (1967) మూవీ ఆమె పెళ్లి తరువాత వచ్చిన మొదటి మూవీ. ఆమె మనోజ్ కుమార్ తో మూడు చిత్రాలలో నటించారు. షాది, పూరబ్ ఔర్ పశ్చిమ్, ఆత్మా త్యాగ్. 1968లో సునీల్ దత్ తో కలిసి చేసిన కల్ట్ ఫిల్మ్ "పడోసన్" ఆమెను బాలీవుడ్ లో టాప్ లీగ్‌కు చేర్చింది. ఆ తర్వాత చాలా సంవత్సరాలు ఆమె హీరోయిన్‌గా కొనసాగారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి