ఈ మద్య సినీ ఇండస్ట్రీలో గత కొంత కాలంగా వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి.  బాలీవుడ్ లో విలక్షణ నటుడు ఇర్ఫాన్ ఖాన్, సీనియర్ నట దిగ్గజం రిషి కపూర్ కన్నుమూసిన విషయం తెలిసిందే. తాజాగా గుండెపోటుతో యంగ్ డైరెక్టర్ జిబిత్ జార్జ్(30) మృతి చెందారు. మే 9వ తేదీ రాత్రి గుండెపోటు రావడంతో ఆయన ఆకస్మికంగా తుదిశ్వాస విడిచారు. శనివారం జార్జ్‌కి ఛాతి నొప్పి వస్తున్నా.. దాన్ని పట్టించుకోకుండా తేలికగా తీసుకున్నారు. అయితే సాయంత్రం వరకూ ఆ నొప్పి తీవ్రతరం కావడంతో ఆయనను ఆసుపత్రి కి తీసుకు వెళ్లారు.   హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ ఆయన కన్నుమూశారు. జిబిత్ మరణంతో మాలీవుడ్ (మలయాళం) తీవ్ర దిగ్భ్రాంతికి గురైంది.

 

ఆయన మృతికి పలువురు సినీ ప్రముఖులు సంతాపం ప్రకటిస్తూ  సోషల్ పోస్ట్ట్వీ  చేశారు. జిబిత్‌కి తల్లిదండ్రులు, ఓ సోదరి ఉన్నారు. ఇప్పుడిప్పుడే  కెరీర్ బాగా సాగుతుందని అందరూ భావిస్తున్న తరుణంలో అర్థాంతరంగా గుండెపోటుతో మరణించడం.. అందరినీ దిగ్భ్రాంతికి గురి చేసింది.  లాక్‌డౌన్ ఎత్తివేసిన అనంతరం మళ్లీ ఈ చిత్రం రిలీజ్ చేయాలని నిర్మాతలు ప్లాన్ చేశారు. ఈ క్రమంలో డైరెక్టర్ జిబిత్ మరణించడం చిత్ర బృందాన్ని షాక్‌కి గురిచేసింది. కానీ విధి వైపరిత్యం.. చిన్న వయసులోనే జిబిత్ జార్జ్ అందరి హృదయాలు కలచి వేస్తుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: