జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఏపీ ప్రభుత్వం ఫోటోగ్రాఫర్లు, వీడియోగ్రాఫర్లకు ఆర్థిక సాయం అందించాలని కోరారు. కరోనా మూలంగా స్వయం ఉపాధిలో భాగంగా ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీలను ఆధారంగా చేసుకున్నవారు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. లాక్ డౌన్ లో వివాహాది శుభకార్యాలు ఉన్న మంచి రోజులన్నీ పోయాయని చెప్పారు. వారికి నాలుగు డబ్బులు సంపాదించుకొనే సమయంలో స్టూడియోలను మూసివేయాల్సి వచ్చిందని ప్రభుత్వం వారిని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. 
 
విపత్కర పరిస్థితిలో 25 మంది చనిపోయారని, అందులో కొందరు ఆత్మహత్య చేసుకొంటే, మరికొందరు ఒత్తిడికి లోనై గుండెపోటుతో చనిపోయారని వారిని ప్రభుత్వం ఆదుకోవాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వం తక్షణ ఆర్థిక సాయం అందించటంతో పాటు ఆరోగ్య బీమా, హెల్త్ కార్డులు అందించాలని డిమాండ్ చేశారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: