ఆంధ్రప్రదేశ్ లో ఉచిత
విద్యుత్ పై ఇప్పుడు తీవ్ర స్థాయిలో రగడ నడుస్తున్న సంగతి తెలిసిందే. అధికార విపక్షాల మధ్య ఈ వ్యవహారం పై మాటల యుద్ధం పెద్ద ఎత్తున జరుగుతుంది. ప్రధానంగా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రభుత్వాన్ని టార్గెట్ గా చేసుకుని చేసిన విమర్శలపై ఇప్పుడు తీవ్ర స్థాయిలో అధికార
పార్టీ నేతలు మండిపడుతున్నారు. తాజాగా
వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి చంద్రబాబు నిన్న ఉదయం చేసిన ఆరోపణలకు ఘాటైన కౌంటర్ ఇచ్చారు.
అబద్దం నడిచొస్తే చంద్రబాబులా వుంటుంది. దీనికి తాజా నిదర్శనం.. కోట్లాది ప్రజల సమక్షంలో ఉచిత
విద్యుత్ పై మహానేత రాజశేఖరరెడ్డి గారు సీఎంగా చేసిన తొలి సంతకంపై కూడా అబద్దమాడేశారు చంద్రబాబు. నీ అబద్దాలకు ప్రజలు సిగ్గుపడుతున్నారు 'ఛీ'బిఎన్. నీయంత చరిత్రహీనుడిని ఈ దేశం చూడలేదు, చూడబోదు. అని తన
ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు.