తాడేప‌ల్లిలో ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి నివాసం వద్ద 1998 క్వాలిఫై టీచర్లు మంగళవారం ఉదయం ఆందోళనకు దిగారు. సీఎం ఇంటిని ముట్ట‌డించాల‌ని ముందుగానే నిర్ణ‌యించుకున్న వారు అంద‌రూ ఈ రోజు ఉద‌య‌మే అక్క‌డ‌కు చేరుకున్నారు. వారు సీఎం ఇంటిని ముట్ట‌డించే ప్ర‌య‌త్నం చేయ‌గా..  పోలీసులు అడ్డుకుని అదుపులోకి తీసుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.

ఈ సంద‌ర్భంగా 1998 క్వాలిఫైడ్ డీఎస్సీ టీచ‌ర్లు మాట్లాడుతూ త‌మ‌ను రెగ్యుల‌రైజ్ చేస్తామ‌ని.. ముఖ్యమంత్రి తన పాదయాత్ర సందర్భంగా హామీ ఇచ్చి 22 నెలలు అవుతోందని... ఇంత వరకు హామీని నిలబెట్టుకోలేదని వారు వాపోయారు. జ‌గ‌న్ తక్ష‌ణ‌మే స్పందించి త‌మ‌కు న్యాయం చేయాల‌ని ఈ సంద‌ర్భంగా వారు కోరారు.

మరింత సమాచారం తెలుసుకోండి: