మోహన్ బాబు కుమార్తెగా మంచు లక్ష్మి సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారు. ఈ కరోనా విలయతాండవంలో మరీ ఎక్కువగా పోస్ట్లు పెడుతూ కరోనా కట్టడికై జాగ్రతలు, సూచనలు ఇస్తున్నారు. ఇటీవలే కేటీఆర్‌కి కరోనా వస్తే తన సినిమాలు చూస్తూ టైమ్ పాస్ చేసుకోమని చెప్పిన ఆమె.. రీసెంట్‌గా వాక్సిన్ తీసుకున్నా అని చెప్పి అడ్డంగా బుక్కైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా మరోసారి తన ట్వీట్‌ ని నెటిజన్స్‌ ట్రోల్ చేస్తున్నారు.
 అసలు ఏమి ట్వీట్ పెట్టారంటే.."రియల్ హీరోలయితే ఇంట్లోనే ఉండండి. మీరు రియల్ హీరోనా లేక తుస్ వ్యక్తులా? అనేది మీరే డిసైడ్ చేసుకోండి" అని ట్వీట్ చేసింది. దీంతో ఈ ట్వీట్‌లో 'తుస్' అనే పదం చూసి ఆమెను ట్రోల్ చేయడం స్టార్ట్ చేశారు నెటిజన్లు. ఇదెక్కడి మాస్ ట్వీట్ బాబోయ్ ఇదేం ఇంగ్లీష్, నీ చర్యలు ఊహాతీతం అక్కా" అంటూ మంచు లక్ష్మిపై అటాక్  చేశారు. అయితే వీటిపై మంచు లక్ష్మి  రియాక్ట్ అవుతూ..'ఇట్స్ మై ఇంగిలిపీసు' అంటూ రిప్లై ఇచ్చారు.

 



మరింత సమాచారం తెలుసుకోండి: