ఎప్పటికప్పుడు చంద్రబాబు, లోకేష్ లను టార్గెట్ చేస్తూ విమర్శలు చేసే వైసీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయి రెడ్డి మరో సరి వారి మీద విమర్శల వర్షం కురిపించారు. తండ్రీకొడుకులు పక్క రాష్ట్రంలో ఉండబట్టే ఈసారి ముందే వర్షాలు  వచ్చాయని అంతా అనుకుంటున్నారని అన్నారు. కరువుకు మారు పేరుగా మారిన నారా వారు ఇంకో 4 నెలలు అడుగు పెట్టకుండా ఉంటే రుతుపవనాలు వర్షాలను కుమ్మరిస్తాయని పేర్కొన్నారు. 

గడచిన రెండేళ్లలాగే ఈ ఏడూ జూన్ లోనే వ్యవసాయ పనులు ఊపందుకుంటాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఇక 20 ఏళ్లకు పైగా అధికారంలో ఉన్న పార్టీ అధ్యక్షుడు బేషరతుగా ఇంకో పార్టీకి మద్ధతిస్తానని ప్రాధేయపడటం ఏ రాష్ట్రంలో జరిగి ఉండదని ఆయన అన్నారు. సొంతంగా గెలిచే సత్తాలేదని బాగా తెలుసని, అందుకే వాళ్లు ఛీ పో అన్నా, ఈసడించి కొట్టినా బాబు నోరు మెదపడం లేదు. ఆశ చావడం లేదు కాబోలని ఎద్దేవా చేశారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: