
భారతదేశం ప్రవేశపెట్టిన కొత్త ఐటీ చట్టాలను ట్విట్టర్ పాటించకపోవడం మొదలు ఇప్పటి అనేక అంశాల్లో వివాదాస్పదంగా మారుతోంది. తాజాగా భారత దేశంలో భాగమైన కాశ్మీర్ లడక్ అలాంటి ప్రాంతాలను వేరే దేశంలో ఉన్నట్లు గా చూపుతూ ట్విట్టర్ దుశ్చర్యకు పాల్పడిన. ఈ నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ లోని ఒక పోలీస్ స్టేషన్లో ట్విటర్ ఇండియా చీఫ్ మనీష్ మహేశ్వరి మీద ఎఫ్ఐఆర్ నమోదైంది.. ఒక్క ఉత్తర ప్రదేశ్ లోనే మనీష్ మహేశ్వర మీద నమోదైన రెండో కేసుగా దీనిని అభివర్ణిస్తున్నారు.
ట్విట్టర్ వెబ్‌సైట్‌లో ఉన్న కెరీర్‌స్ అనే సెక్షన్‌లో ఉన్న ‘ట్వీప్ లైఫ్’ హెడర్‌లో తప్పుల తడకగా ఉన్న ఈ మ్యాప్‌ను ప్రచురించింది. ఇక ఇప్పటికే ప్రతి విషయంలో గొడవ పడుతున్న ట్విట్టర్ ఈ తాజా వ్యవహారం కారణంగా ప్రభుత్వం నుంచి కఠిన చర్యలు ఎదుర్కోబోతోందని భావిస్తున్నారు. ట్విట్టర్ గతంలో కూడా లడఖ్ రాజదాని లేహ్‌ను చైనా భూభాగంగా చూపించి టార్గెట్ అయింది.