ఆగస్టు 15 న ఓలా కంపెనీ ఎలక్ట్రిక్ స్కూటర్లను విడుదల చేస్తున్నట్లు ప్రకటించిన తరువాత, అధికారికంగా సెప్టెంబర్ 15 న అమ్మబడ్డాయి. ఎందుకంటే ఓలా అధికారిక వెబ్‌సైట్‌లో సాంకేతిక ఇబ్బందుల కారణంగా కంపెనీ వాటి అమ్మకాలను వాయిదా వేయాల్సి వచ్చింది. S1ఇంకా S1 ప్రో స్కూటర్ల  అమ్మకాలలో కంపెనీకి బలమైన స్పందన లభించింది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఓలా సీఈఓ, CEO భవిష్ అగర్వాల్ సోషల్ మీడియాలో తమ మొదటి అమ్మకాల సేల్స్ ను వెల్లడించారు. ఓలా ఎలక్ట్రిక్ ఇ-స్కూటర్లు రూ .600 కోట్ల అమ్మకాలను నమోదు చేసినట్లు ఆయన చెప్పారు.ఇది సరికొత్త రికార్డనే చెప్పాలి.సెప్టెంబర్ 15 బుధవారం సాయంత్రం నుంచి కూడా తమ కంపెనీ నుంచి ప్రతి సెకనులో నాలుగు యూనిట్ల ఇ-స్కూటర్లను అమ్మినట్లు ఓలా కంపెనీ ప్రకటించడం జరిగింది.ఓలా కంపెనీ తమ ఎలక్ట్రిక్ స్కూటర్ల కొనుగోలులో ఏ డీలర్‌ని భాగస్వామ్యం చేయలేదు. ఇంకా వాటిని నేరుగా వినియోగదారులకు అమ్ముతుంది. బుక్ చేసిన యూనిట్ ఫ్యాక్టరీ నుండి డెలివరీకి వెళ్లనంత వరకు రిజర్వేషన్ ఇంకా అడ్వాన్స్ చెల్లింపు మొత్తాన్ని తిరిగి చెల్లించవచ్చని కంపెనీ తెలిపడం జరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి: