మావోయిస్టు అగ్రనేత హిడ్మా తెలంగాణ లోకి ప్రవేశించినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. 40 ఏళ్ల హిడ్మ అనారోగ్యానికి గురయ్యారని దాంతో చత్తీస్గడ్ సరిహద్దులో నుండి తెలంగాణలోకి ప్రవేశించారని పోలీసులు అనుమానిస్తున్నారు. అంతే కాకుండా భూపాలపల్లి ములుగు జిల్లా ఏజెన్సీ లోకి ప్రవేశించినట్టు అనుమానిస్తున్నారు. ఇక మావోయిస్టు పార్టీకి చెందిన అగ్రనేత తెలంగాణలోకి ప్రవేశించినట్టు సమాచారం అందడంతో పోలీసులు ఇప్పటికే అడవులను జల్లెడ పట్టడం ప్రారంభించారు. ఛత్తీస్గఢ్ తెలంగాణ రాష్ట్ర సరిహద్దులో ఉన్న ప్రతి వాహనాన్ని పోలీసులు తనిఖీలు చేస్తున్నారు.

అదేవిధంగా భూపాలపల్లి జిల్లా ములుగు ఏజెన్సీ పరిధిలో ఉన్న ప్రభుత్వ ప్రైవేటు ఆసుపత్రులు అన్నింటిని పోలీసులు జల్లెడ పడుతున్నారు. ఇక హిడ్మా తెలంగాణ లోకి ప్రవేశించాడన్న వార్తల నేపథ్యంలో తెలంగాణ చత్తీస్ఘడ్ సరిహద్దుల్లో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఇదిలా ఉంటే తక్కువ వయసులోనే హిడ్మా మావోయిస్టు పార్టీలో కేంద్ర కమిటీ సభ్యుడు గా ఎదిగారు.. అంతేకాకుండా ముఖ్యంగా దాడుల వ్యూహకర్తగా హైడ్మా  కు మావోయిస్ట్ పార్టీ లో మంచి పేరు ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: