గ‌త కొంత‌కాలంగా హైద‌రాబాద్ క్రికెట్ అసోసియేష‌న్‌లో వివాదాలు త‌లెత్తిన విష‌యం విధిత‌మే.  అజారుద్దీన్ ను హెచ్‌సీఏ అధ్య‌క్షునిగా అపెక్స్ కౌన్సిల్ త‌ప్పించడంతో హైకోర్టులో కూడ గ‌తంలో స‌వాలు చేశారు. తాజాగా సుప్రీంకోర్టు ఇవాళ తీర్పును ఇచ్చింది.  కొన్ని నెల‌ల క్రితం అజారుద్దీన్‌ను అపెక్స్ కౌన్సిల్ స‌స్పెండ్ చేస్తూ తీసుకున్న నిర్ణ‌యం స‌రైన‌దేన‌ని సుప్రీంకోర్టు వెల్ల‌డించింది. అపెక్స్‌మెన్ దీప‌క్ వ‌ర్మ తో పిటీష‌న్ దాఖ‌లు చేశారు అజారుద్దీన్‌. దీప‌క్‌వ‌ర్మ పిటీష‌న్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. దీప‌క్‌వ‌ర్మ నియామ‌కం కూడ చెల్ల‌ద‌ని సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది.

గ‌త కొంత‌కాలంగా న‌లుగుతున్న ఈ స‌మ‌స్య‌కు పులిస్టాప్ ప‌డింది.  గ‌తంలోనే అజారుద్దీన్‌ను స‌స్పెండ్ చేయ‌డం, దీప‌క్‌వ‌ర్మ నియామ‌మ‌కం చెల్లదు అని అపెక్స్ కౌన్సిల్ నిర్ణ‌యం  తీసుకున్న‌ది. ఈ రెండు నిర్ణ‌యాల‌పై అజారుద్దీన్‌, దీప‌క్‌వ‌ర్మ సుప్రీంకోర్టులో పిటీష‌న్ దాఖ‌లు చేశారు. ఈరోజు విచారించిన సుప్రీంకోర్టు పిటీష‌న్‌ను కొట్టేసింది. అజారుద్దీన్ అధ్య‌క్షునిగా నియామ‌కం చెల్ల‌దు. అపెక్స్ కౌన్సిల్ తీసుకున్న నిర్ణ‌యం చెల్లుబాటు అవుతుంద‌ని సుప్రీంకోర్టు తీర్పును ఇచ్చింది. హెచ్‌సీఏ ప్ర‌స్తుత ఉపాధ్య‌క్షుడు జాన్‌మ‌నోజ్ త‌దుప‌రి హెచ్‌సీఏ అధ్య‌క్షునిగా కొన‌సాగుతాడు. ఇద్ద‌రి మ‌ధ్య పోటాపోటీగా కొద్ది రోజుల పాటు మాట‌ల యుద్ధం న‌డిచింది. హైకోర్టును ఆశ్ర‌యించారు. నేడు సుప్రీంకోర్టు తీర్పును ఇవ్వ‌డంతో ఈ వివాదానికి పులిస్టాప్ ప‌డింది. ఇది ఇలా ఉండ‌గానే ఉప్ప‌ల్ స్టేడియంలో ఈరోజు స‌మావేశం ఒక స‌మావేశం జ‌రుగుతున్న‌ది. ఆ స‌మావేశంలో అజారుద్దీన్ హాజ‌ర‌య్యారు. త‌దుప‌రి అజారుద్దీన్ వ్యూహం ఏమిట‌నేది తెలియాల్సి ఉంది.


మరింత సమాచారం తెలుసుకోండి: