హుజురాబాద్ ఉప ఎన్నిక‌ల‌కు సంబంధించి గెలుపు ఓట‌ముల‌పై అప్పుడే చ‌ర్చ‌న‌డుస్తోంది. కొన్ని టీవీ ఛానెళ్లు అప్పుడే ఎగ్జిట్ పో ల్స్ పై చ‌ర్చ‌లు, చ‌ర్చోప‌చ‌ర్చ‌లు న‌డిపిస్తున్నాయి. గులాబీ దండు ఎంత‌గా అధికార దుర్వినియోగానికి పాల్ప‌డినా కూడా ఈటెల రాజేంద‌ర్ ను గెలుపు వ‌రించ‌డం ఖాయం అని జోస్యం చెబుతున్నాయి. ఇదే త‌రుణంలో గులాబీ దండు పూర్తిగా వెనుక‌బ‌డిపో యిందని కూడా తెలుస్తోంది. ఓట‌ర్ల‌పై ద‌ళిత బంధు ఎఫెక్ట్ చాలా ఉంద‌ని, కానీ అది నివురు గ‌ప్పిన నిప్పులా ఉంద‌ని రాజ‌కీయ విశ్లేష‌కు లు అంటున్న మాట. ముఖ్యంగా డ‌బ్బులు ఇచ్చి కూడా ఆంక్ష‌లు విధించారు అన్న మాట లేదా అప‌వాదు కేసీఆర్ మోయాల్సి వ చ్చింది. ద‌ళిత బంధు ప‌థ‌కం కింద ల‌బ్ధిదారుల ఎంపిక అన్న‌ది పూర్తిగా క‌లెక్ట‌ర్ సార‌థ్యంలో పార‌ద‌ర్శ‌కంగా జ‌రిగిన‌ప్ప‌టికీ కేసీఆర్ సూచ‌న‌లు మేర‌కు ఆ డ‌బ్బును  ఉపాధి అవ‌కాశాల పెంపుద‌లకే వాడుకోవాల‌ని, వ్య‌క్తిగ‌త ఖ‌ర్చుల‌కు వినియోగించ‌రాద‌ని, అదేవి ధంగా యూనిట్ల ఏర్పాటు విష‌య‌మై క‌లెక్ట‌రు నిరంత‌రం ప‌ర్య‌వేక్షించాలని అప్పుడే ఈ ప‌థ‌కం అమ‌లు స‌జావుగా సాగుతుంద‌ని స్పష్ట‌మ‌యిన ఆదేశాలు కేసీఆర్ ఇచ్చారు. దీంతో ద‌ళిత బంధు ల‌బ్ధిదారులు పూర్తి అయోమయంలో ప‌డిపోయారు.

 ద‌ళిత బంధు డ‌బ్బుల‌తో కారు కొనుగోలు చేసి, క్యాబ్ స‌ర్వీస్ కింద న‌డుపుకుందామ‌న్నా ముందు సాధ్యా సాధ్యాలు ప‌రిశీలించాకే అందుకు స‌మ్మ‌తించేలా అధికార యంత్రాంగం, బ్యాంక‌ర్లు ప‌ట్టుపట్టారు. ఇందుకు నిబంధ‌న‌లు సైతం వివ‌రించారు. అయినా కూడా కేసీఆర్ ఉద్దేశాన్ని ప్ర‌జ‌లు త‌ప్పుగా భావించారు. దీంతో ద‌ళిత బంధు ప‌థ‌కం అమ‌లుపై నీలినీడ‌లు క‌మ్ముకున్నాయి. ఇక మిగ‌తా విష‌యాల‌ను సైతం ఇదే స‌మ‌యాన ప‌రిశీలించి విశ్లేషిస్తే..ఈటెలకు త‌న‌దైన ఫాలోయింగ్ ఈ నియోజ‌క‌వ‌ర్గంలో ఎప్ప‌టి నుంచో ఉంది. స్థానికంగా మంచి ప‌ట్టున్న నేత.



అంతేకాదు బీసీ కార్డు తో పాటు రెడ్డి సామాజిక‌వ‌ర్గ నేత‌లు కూడా ఆయ‌న‌కు అండ‌గా ఉంటున్నారు.అంతేకాదు ఆయ‌న‌పై చేసిన అవినీతి ఆరోప‌ణ‌లు అన్న‌వి కూడా పెద్ద‌గా హైలెట్ కాలేదు. తెలంగాణ రాష్ట్ర స‌మితి నిల‌బెట్టిన అభ్య‌ర్థి గెల్లు కూడా ఈటెల‌ను ఢీ కొనేంత శ‌క్తిమంతుడు కాదు. ఆ విష‌యం కేసీఆర్ కు తెలిసినా కూడా హ‌రీశ్ రావును ఈ చ‌ద‌రంగంలో పావులా వాడుకుని, ఆయ‌న ఇమేజ్ ను డ్యామేజ్ చేసేందుకే ఈ ప‌న్నాగం ప‌న్నాడ‌ని ఓ పొలిటిక‌ల్ టాక్. ఆఖరుగా మెజార్టీ విష‌యాన్నే ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుంటే కొంద‌రు ఏడు శాతం తేడాతో ఈటెల గెలుస్తాడ‌నే చెబుతున్నారు. పెద్ద మెజార్టీ రాకున్నా కూడా ఆత్మ‌గౌర‌వ నినాదం వినిపించిన ఈటెల‌దే గెలుపు అని చెబుతున్నాయి ఎగ్టిట్ పోల్స్ రిజ‌ల్ట్స్.


మరింత సమాచారం తెలుసుకోండి:

bjp