కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఒక ముఖ్య గమనిక ఏమిటంటే.. బయోమెట్రిక్ అటెండెన్స్ విషయంలో మోడీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నవంబర్ 8 నుంచి కేంద్ర ప్రభుత్వ పరిధిలో పనిచేసే అన్ని స్థాయిలలో ఉద్యోగులకు బయోమెట్రిక్ అటెండెన్స్ ప్రారంభించనున్నట్టు పేర్కొన్నది. అదేవిధంగా బయోమెట్రిక్ మెషిన్ల పక్కనే శానిటైజర్లు ఉండే విధంగా చూసుకోవాలని విభాగ అధిపతులను సూచించింది. కరోనా వ్యాప్తికి కారణంగా ఉద్యోగులకు బయోమెట్రిక్ హాజరు నుండి గతంలో మినహాయింపు ఇచ్చింది.
ఇప్పుడు కరోనా కాస్త తగ్గుముఖం పట్టడంతో తిరిగి పునఃప్రారంభించాలని కేంద్రం నిర్ణయించినది. ఉద్యోగులందరూ బయోమెట్రిక్ హాజరు వేసేటప్పుడు ఆరు అడుగుల భౌతిక దూరాన్ని కచ్చితంగా పాటించాలని, అవసరం అయితే రద్దీని నివారించడానికి అదనపు బయోమెట్రిక్ మెషిన్లను అమర్చాలని సూచించింది. కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు, విభాగాలకు ఆదేశాలు జారీ చేసింది ప్రభుత్వం. ఉద్యోగులందరూ తప్పకుండా మాస్క్‌లు, లేదా ఫేస్ కవర్లను ధరించాలని సూచించింది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి