నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ 125 వ జయంతి సందర్భంగా ప్రధాని మోడీ ఆయనకు ఘన నివాళులు అర్పించారు. ఇండియాగేట్ వద్ద నేతాజీ హాలోగ్రామ్‌ విగ్రహం ఆవిష్కరించి అపురూపంగా నివాళి అర్పించారు. ప్రస్తుతం ఆవిష్కరించిన నేతాజీ హాలోగ్రామ్‌ విగ్రహం స్థానంలో త్వరలోనే గ్రానైట్‌ విగ్రహం ఏర్పాటు చేయనున్నారు.


ఈ కార్యక్రమంలో నేతాజీకి మోదీ, అమిత్‌ షా ఘనంగా నివాళులు అర్పించారు. ఏడాదిగా పరాక్రమ్ దివస్ ఉత్సవాలు నిర్వహిస్తున్నామని తెలిపిన ప్రధాని మోదీ.. స్వాతంత్ర్యం పోరాడి సాధించాలి.. అభ్యర్థించేది కాదని నేతాజీ అనేవారని ప్రధాని గుర్తు చేసుకున్నారు. తెల్లదొరలకు తలొగ్గడాన్ని నేతాజీ ఎప్పుడూ తిరస్కరించేవారని.. నేతాజీ విగ్రహం.. ప్రజాస్వామ్య విలువలు, భావితరాలకు స్ఫూర్తి అని ప్రధాని నరేంద్ర మోడీ కొనియాడారు. నేతాజీ కలలు, ఆశయాలను నెరవేర్చే సమయం వచ్చిందన్న మోడీ.. మరో పాతికేళ్లలో సరికొత్త భారత్‌ను నిర్మించుకోవడమే మన లక్ష్యం అని గుర్తు చేసుకున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: