ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులో మళ్లీ రాజధాని కేసుల విచారణ ప్రారంభం కాబోతోంది. ఇవాళ మూడు రాజధానుల కేసులపై విచారణ జరుగబోతోంది. ఈ కేసు త్రిసభ్య ధర్మాసనం ఎదుట విచారణ ప్రారంభం కానుంది. అయితే.. ఇప్పటికే జగన్ ప్రభుత్వం మూడు రాజధానుల చట్టాన్ని వెనక్కి తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే ప్రభుత్వం మూడు రాజధానుల బిల్లును వెనక్కి తీసుకున్నా.. మళ్లీ ప్రవేశపెడతామని హైకోర్టులో ప్రభుత్వం స్పష్టం చేసింది. 



అందుకే రాజధాని రైతులు తమ పిటిషన్లపై విచారణ కొనసాగించాలని కోరుతున్నారు. ఈ మేరకు వాదనలకు రైతుల తరపు లాయర్లు సిద్ధమయ్యారు. ఏ అంశాలపై విచారించాలో అఫిడవిట్లు వేయాలని హైకోర్టు గతంలోనే అడిగింది. అలాగే ప్రభుత్వం కూడా కౌంటర్ దాఖలు చేయాలని గతంలోనే ధర్మాసనం ఆదేశించింది. ఇప్పుడు కరోనాతో థర్డ్ వేవ్ విజృంభించడంతో హైకోర్టులో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరుగుతుంది. మరి తీర్పు ఏ విధంగా వస్తుందో.. ఏమో..?  

మరింత సమాచారం తెలుసుకోండి: