రాజధాని కోసం ఆ రాష్ట్రంలో ఏకంగా సీఎం డిమాండ్ చేస్తున్నారు. కేంద్ర పాలిత ప్రాంతమైన చండీగఢ్‌ను తక్షణం పంజాబ్‌కు బదిలీ చేయాలంటున్నారు ఆ రాష్ట్ర కొత్త ముఖ్యమంత్రి భగవంత్‌ మాన్‌. ఈ మేరకు ఆయన కేంద్రాన్ని డిమాండ్‌ చేశారు. పంజాబ్‌ అసెంబ్లీలో ఈ విషయంపై ప్రవేశపెట్టిన తీర్మానానికి సభ ఆమోదం తెలిపింది. కేంద్రపాలిత ప్రాంతం, ఉమ్మడి ఆస్తుల నిర్వహణలో సమతుల్యతను దెబ్బతీసేందుకు కేంద్రం ప్రభుత్వం ప్రయత్నిస్తోందని మాన్‌ గతంలోనే ఆరోపించారు.


చండీగఢ్‌ అడ్మినిస్ట్రేషన్‌లో పనిచేసే ఉద్యోగుల సర్వీస్‌ నిబంధనలు కేంద్ర సివిల్‌ సర్వీసులకు అనుగుణంగా ఉంటాయని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ఇటీవల ఓ ప్రకటన చేశారు. ఈ  ప్రకటనను కూడా మాన్‌ తప్పుబట్టారు. కేంద్రం చర్యలు నియంతృత్వ ధోరణిలో ఉన్నాయని సీఎం భగవంత్ మాన్ ఆరోపించారు. అంతే కాదు.. పంజాబ్‌ ప్రజల ప్రయోజనాలను కాపాడేందుకు ప్రతిపక్షాలన్నీ కలసిరావాలని పంజాబ్ కొత్త సీఎం చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

aap