రైతులకు కేంద్రం ఓ గుడ్ న్యూస్ చెప్పింది. తక్కువ ధరకు భూసారాన్ని అందించేందుకు సబ్సిడీ భారీగా పెంచింది. ఈ ఆర్థిక సంవత్సరం మొదటి ఆరు నెలలకు.... ఎరువులకు 60వేల కోట్ల సబ్సిడీ ఇవ్వాలని నిర్ణయించింది. ఈ ప్రతపాదనకు కేంద్ర కేబినేట్ ఆమోదం తెలిపింది. ఏప్రిల్ 1 నుంచి సెప్టంబర్ 31 మధ్య ఈ సబ్సిడీ నిధులను ఖర్చు చేస్తారు. గత ఆర్థిక సంవత్సరం మెుత్తానికి ఎరువులపై 57వేల కోట్లు సబ్సిడీ ఇచ్చింది కేంద్రం. ఈ ఏడాది ఒక్క ఖరీఫ్ సీజన్‌కే 60వేల కోట్లను ప్రకటించినట్లు కేంద్రం చెబుతోంది.
దీంతోపాటు కేంద్రం అనేక షాకింగ్ నిర్ణయాలు తీసుకుంది. అవేంటంటే.. జమ్మూకాశ్మీర్‌లో 540 మెగా వాట్ల క్వార్ హైడ్రో ఎలక్ర్టిక్ ప్రాజెక్టు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. మెుత్తం 4వేల 526 కోట్ల ఖర్చుతో ఈ ప్రాజెక్టును ఏర్పాటు చేస్తారు. ఈ ప్రాజెక్టు ద్వారా ఏటా 1975.54 మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తారు. అలాగే నక్సలైట్ ప్రభావిత ప్రాంతాల్లో ప్రస్తుతమున్న 2G మెుబైల్ టెలికాం సేవలను 4Gకి పెంచుతారు. దీనికి రెండున్నర వేల కోట్లు ఖర్చు చేస్తారు. ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంకుకు అదనంగా820 కోట్లు ఆర్థిక సాయం చేస్తారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి