ఇవాళ ఏపీ సీఎం జగన్ ఖాతాల్లో డబ్బులు వేయనున్నారు. ఎవరి ఖాతాల్లో అనుకుంటున్నారా.. ఈసారి మత్స్య కారుల వంతు.. ఇప్పటికే సంక్షేమానికి కేలండర్ ప్రకటించిన ప్రకారమే పథకాల అమలు చేస్తున్న జగన్ సర్కారు.. ఇవాళ  కోనసీమ జిల్లా ముమ్మిడివరంలో మత్స్యకార భరోసా పథకాన్ని ప్రారంభిస్తోంది. అలాగే.. జూన్ 14 తేదీన వైఎస్సార్ పంటల భీమా కింద కూడా 2021 ఖరీఫ్ సీజన్ లో పంట నష్టపోయిన రైతులకు భీమా డబ్బులు ఖాతాల్లో వేయబోతున్నారు. ఈ చెల్లింపునకు కేబినెట్ ఆమోదం తెలిపింది. అలాగే జూన్ 21 తేదీన ప్రతిష్టాత్మకమైన అమ్మ ఒడి పథకం కింద తల్లుల ఖాతాల్లో నిధులు వేసేందుకు కూడా ఏపీ కేబినెట్ ఆమోదం తెలియ చేసింది. సీఎం జగన్ ప్రభుత‌్వం సంక్షేమానికి ఎక్కువగా ప్రాధాన్యం ఇస్తున్న సంగతి తెలిసిందే. ఏదోలా ప్రతి కుటుంబానికీ సర్కారు డబ్బు చేరాలి అన్న లక్ష్యంతో జగన్ సర్కారు పని చేస్తున్నట్టు కనిపిస్తోంది. ఇది ఎంతవరకూ రాజకీయంగా లాభిస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: