కేంద్రం తాజాగా పెట్రోల్‌ ధరలు తగ్గించిన సంగతి తెలిసిందే. దీంతో వినియోగదారుడికి లీటర్‌ రూ. 8 నుంచి 10 రూపాయల వరకూ భారం తగ్గింది. అయితే తెలంగాణ సర్కారు వ్యాట్ తగ్గిస్తే రేట్లు ఇంకా తగ్గుతాయంటున్నారు బీజేపీ నేతలు. రష్యా- ఉక్రెయిన్‌ యుద్ధ ప్రభావమున్నా కేంద్రం చమురు ధరలను తగ్గించిందని.. కేంద్రం మాదిరిగానే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా వ్యాట్‌ తగ్గించాలని బీజేపీ నేతలు డిమాండ్‌ చేస్తున్నారు.

లీటర్‌ పెట్రోల్‌పై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రూ.30 పన్ను విధిస్తోందని బీజేపీ నేతలు అంటున్నారు. తెలంగాణ రాష్ట్రం వ్యాట్‌ తగ్గిస్తే లీటర్‌ పెట్రోల్‌ రూ.80కే ఇవ్వొచ్చని సూచిస్తున్నారు. ఇదే సమయంలో మరికొన్ని రాజకీయ విమర్శలు కూడా చేస్తున్నారు. దోచుకున్న సొమ్ము దాచుకునేందుకే కేటీఆర్‌ విదేశీ పర్యటనకు వెళ్లారుని బీజేపీ నేతలు మండిపడుతున్నారు. సీఎం కేసీఆర్‌ తెలంగాణలో చేసిందేమీ లేకపోగా దేశాన్ని ఉద్ధరిస్తామని బయలు దేరారని బీజేపీ నేతలు ఎద్దేవా చేస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: