మోదీ సర్కారు బాదుడు కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. వివిధ రాయితీలను ఎత్తేస్తున్న కేంద్రం ఇటీవల రైల్వేలో వృద్ధులకిచ్చే సౌకర్యాలు కూడా తగ్గిస్తున్నారు. అయితే.. వివిధ వర్గాల నుంచి తీవ్రమైన వ్యతిరేకత రావటంతో వయో వృద్ధుల రాయితీని పునరుద్ధరించాలని రైల్వేశాఖ ఆలోచిస్తోంది. అయితే జనరల్‌, స్లీపర్‌ తరగతులకే రాయితీని పరిమితం చేసే ఆలోచన ఉన్నట్లు రైల్వే వర్గాలు తెలిపాయి.


ప్రస్తుతం మహిళలకు 58 ఏళ్లు, పురుషులకు 60 ఏళ్లు ఉంటే రాయితీ ఇస్తున్న రైల్వేశాఖ.... వయో వృద్ధుల వయసును.. 70ఏళ్లకు పెంచాలని భావిస్తోంది. దీనివల్ల కొంత భారం తగ్గించుకోవచ్చనే ఆలోచన చేస్తున్నట్లు రైల్వే వర్గాలు తెలిపాయి. వయో వృద్ధులకు ఈ రాయితీ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందంటోంది. అయితే.. పూర్తిగా రద్దు చేస్తున్నట్లు ఎప్పుడూ చెప్పలేదని తెలిపాయి. ఈ అంశంపై సమీక్ష జరుగుతోందంటున్నాయి. త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని రైల్వే శాఖ చెబుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: