దేశ ఉన్నత విద్యారంగంలో కొత్త శకాన్ని సృష్టించిన ఉస్మానియా విశ్వవిద్యాలయం... గ్లోబల్ లెర్నింగ్ సెంటర్‌ అంటూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్‌.వి. రమణ ప్రశంసించారు. భారత్ వంటి ప్రజాస్వామిక దేశాల్లో విశ్వవిద్యాలయాలే జాతి నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తాయని జస్టిస్ ఎన్‌.వి. రమణ అన్నారు. విద్యార్థులు ఏ కోర్సు చదివినా దేశంలోని చట్టాలు, పరిపాలన అంశాలపై ఉండేలా సబ్జెక్టును ప్రవేశపెట్టాల్సిన అవసరం ఉందని జస్టిస్ ఎన్‌.వి. రమణ సూచించారు.  


సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్‌.వి. రమణ ఉస్మానియా యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్ ప్రదానం చేసింది. ఓయూ 82వ స్నాతకోత్సవంలో గవర్నర్ తమిళిసై చాన్సలర్ హోదాలో జస్టిస్‌ రమణకు గౌరవ డాక్టరేట్ ప్రదానం చేశారు. దేశంలోని ఉన్నత విద్యలో కొత్త శకాన్ని సృష్టించి.. ఆధునిక భారతదేశ నిర్మాణంలో భాగస్వామ్యమైన ఉస్మానియా యూనివర్సిటీ ఎంతో మంది మేధావులను తయారు చేసిందని జస్టిస్ ఎన్‌.వి.రమణ తెలిపారు. పీవీ, కేసీఆర్‌ వంటి నేతలను ఓయూ అందించిందన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: