ఆంధ్రప్రదేశ్‌లో ట్రిపుల్ ఐటీల్లో ప్రవేశాల కోసం ఈనెల 30వ తేదీన నోటిఫికేషన్ జారీ చేయనున్నారు. ఆర్జేయూకేటీ కులపతి కేసీరెడ్డి, ఉప కులపతి హేమచంద్రారెడ్డి ఈ మేరకు పత్రికా ప్రకటన విడుదల చేశారు. ఏపీలోని ఇడుపులపాయ, ఒంగోలు, నూజివీడు ప్రాంతాల్లో ట్రిపుల్ ఐటీలు నడుస్తున్నాయి. ప్రభుత్వ పాఠశాలల్లో చదివి పదో తరగతిలో మంచి మార్కులు సాధించిన విద్యార్థులకు ట్రిపుల్ ఐటీల్లో ఇంటర్మీడియట్, ఇంజినీరింగ్ విద్యను అందించేందుకు ప్రవేశాలు నిర్వహిస్తారు.


ట్రిపుల్ ఐటీల్లో ప్రవేశాల కోసం రెండు నెలల నుంచి విద్యార్థులు ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో జూనియర్ కళాశాలలు ప్రారంభమై రెండునెలలు కావస్తున్నాయి. కొన్ని సాంకేతిక పరమైన కారణాలు, ఉన్నతస్థాయిలో తీసుకోవాల్సిన నిర్ణయాల మేరకు నోటిఫికేషన్ జారీ ప్రక్రియ ఆలస్యమైంది. ఎట్టకేలకు ఈనెల 30వ తేదీన ట్రిపుల్ ఐటీలకు నోటిఫికేషన్ జారీ కాబోతోంది. విద్యార్థులు ఆన్ లైన్ లో దరఖాస్తు కోవాల్సి ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: