కరోనా.. ఇప్పుడు దీన్ని అంతగా ఎవరూ పట్టించుకోవడం లేదు. ఇదో సాధారణ జలుబుగా మారిందని చాలామంది భావిస్తున్నారు. కానీ.. మరోవైపు దేశంలో కరోనా కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి. అందుకే.. దేశంలో కరోనా వైరస్‌ విజృంభణ కొనసాగుతున్న దృష్ట్యా......... వీలైనంత తొందరగా బూస్టర్‌ డోసులు తీసుకోవాలని కేంద్రం చెబుతోంది. ఈ మేరకు నేషనల్‌ టెక్నికల్‌ అడ్వైజరీ గ్రూప్‌ ఆన్‌ ఇమ్యూనైజేషన్‌  ఛైర్మన్‌ డాక్టర్‌ ఎన్‌కే అరోరా ప్రజలకు విజ్ఞప్తి చేశారు.


ముందుగా తీసుకున్న వ్యాక్సిన్‌ల నుంచి పొందిన యాంటీబాడీలు ఆరు నుంచి ఎనిమిది నెలల్లోనే తగ్గిపోతున్నాయని ఆయన చెబుతున్తనారు. అందుకే వీలైనంత త్వరగా ప్రికాషనరీ డోసు తీసుకోవాలని అరోరా స్పష్టం చేశారు. మన ఆరోగ్యానికి బూస్టర్‌ డోసు ఇన్సూరెన్స్‌గా పనిచేస్తుందని ఆరోరా అంటున్నారు. ఈ మధ్య కాలంలో ఆస్పత్రి పాలైన కరోనా రోగుల్లో 90శాతం మంది బూస్టర్‌ తీసుకోని వారేనని అరోరా చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: