ప్రముఖ చలనచిత్ర నటుడు, మాజీ కేంద్ర మంత్రి కృష్ణం రాజు మరణం పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సంతాపం తెలిపారు. యాభై ఏండ్ల సినీ ప్రస్థానంలో అనేక సినిమాల్లో హీరోగా నటించి, తన విలక్షణ నటనాశైలితో కృష్ణంరాజు.. రెబల్ స్టార్ గా సినీ ప్రేక్షకుల హృదయాల్లో అభిమానం సంపాదించుకున్నారని అన్నారు. కృష్ణంరాజు మరణం, తెలుగు వెండితెర, రాజకీయ రంగానికి తీరని లోటని తెలంగాణ సీఎం కేసిఆర్ పేర్కొన్నారు. లోక్ సభ సభ్యునిగా, కేంద్ర మంత్రిగా,  రాజకీయ పాలనారంగం ద్వారా, దేశ, రాష్ట్ర  ప్రజలకు సేవలందించిన కృష్ణంరాజు మరణం విచారకరమని సీఎం కేసీఆర్ అన్నారు. కృష్ణంరాజు ఆత్మకు శాంతి చేకూరాలని తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రార్థించారు.

కృష్ణంరాజు కుటుంబ సభ్యులకు తెలంగాణ సీఎం కేసీఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. తనకు అత్యంత ఆప్త మిత్రుడు, మాజీ కేంద్ర మంత్రి కృష్ణంరాజు అంత్యక్రియలను అధికార లాంఛనాలతో నిర్వహించాలని తెలంగాణ సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ఆదేశించారు. కేసీఆర్ఆదేశాల మేరకు సిఎస్ సోమేశ్ కుమార్ ఏర్పాట్లు చేయనున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: