సొంత పార్టీ ఎమ్మెల్యేలకు చంద్రబాబు ఓ గుడ్ న్యూస్ చెప్పారు. టీడీపీ ఎమ్మెల్యేల్లో ప్రజా సమస్యలపై పోరాడుతున్నవారందరికీ మళ్లీ టికెట్లు ఖాయమని టీడీపీ అధినేత చంద్రబాబు భరోసా ఇచ్చారు. వచ్చే ఎన్నికల్లో టికెట్‌పై ఆందోళన వద్దని.. టీడీపీ ఎమ్మెల్యేలకు ఆ భయం అవసరం లేదని, ప్రజా సమస్యలపై పోరాటమే మళ్లీ వారిని గెలిపిస్తుందని చంద్రబాబు వారితో అన్నారు.

ఇదే సమయంలో వైసీపీ పై విమర్శలు చేస్తూ.. సిట్టింగ్‌ ఎమ్మెల్యేలందరికీ టికెట్లు ఇచ్చే ధైర్యం జగన్‌కు ఉందా అని చంద్రబాబు ప్రశ్నించారు. తన ఎమ్మెల్యేలపై ప్రజల్లో వస్తున్న వ్యతిరేకతను చూసి జగన్‌ తీవ్ర నిస్పృహలో ఉన్నారని చంద్రబాబు అన్నారు. జగన్ తన వైఫల్యాలన్నిటినీ పార్టీ ఎమ్మెల్యేలపైకి నెట్టివేయాలని చూస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు. జగన్‌తో  సమావేశమంటేనే వైసీపీ ఎమ్మెల్యేలు భయపడుతున్నారని చంద్రబాబు అన్నారు. వైసీపీ ఎమ్మెల్యేల్లో కొందరు మళ్లీ టికెట్‌ రాదన్న భయం ఉందని చంద్రబాబు తెలిపారు. మరికొందరు టికెట్‌ వచ్చినా గెలవలేమన్న ఆందోళనలో ఉన్నారని చంద్రబాబు అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: