మే నుంచి ఫోర్టిఫైడ్ చేసిన బియ్యాన్ని ప్రతి జిల్లాలోను చౌకదుకాణాల ద్వారా అందించేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 7 జిల్లాల్లో ఫోర్టిఫైడ్ బియ్యం సరఫరా చేస్తున్నారు. కొంతమంది అవగాహనా లోపంతో ఫ్లాస్టిక్ రైస్ కలుపుతున్నారని ప్రచారం చేస్తున్నారు. ఫోర్టిఫైడ్ బియ్యంలో విటమిన్ బి12, ఐరన్, ఫోలిక్ యాసిడ్స్ లభించే విధంగా బలవర్థకమైన ఆహారం కోసం 50 కేజీల బస్తాలో 500 గ్రామలు కెర్నెల్స్ కలుపుతారు. ఏపీ రాష్ట్రాన్ని ఆదర్శంగా తీసుకుని తెలంగాణ రాష్ట్రంలో కూడా ఈ విధానాన్ని అమలు చేస్తోంది.

జాతీయ ఆహార భధ్రత చట్టం-2013 పరిధిలోని సంక్షేమ పథకాలకు సంబంధించిన సమాచారం, ఫిర్యాదుల కోసం ప్రజలు, అధికారులకు అవగాహ నిమిత్తం పోస్టర్ ను విడుదల చేశారు. వాట్సాప్ నెంబర్, టోల్ ఫ్రీ నెంబర్, సోషల్ మీడియా వివరాలతో కూడిన దాదాపు లక్ష స్టిక్కర్ పోస్టర్లను పంపిణీ చేస్తారు. రేషన్ బియ్యం పంపిణీ, అంగన్వాడీ కేంద్రాలలో పౌష్టికాహార పంపిణీ, జగనన్న గోరుముద్ద వంటి  సంక్షేమ పథకాలకు సంబంధించి ఎటువంటి ఫిర్యాదులున్నా వాట్సాప్ నెంబర్ 949055117 కి గానీ, టోల్ ఫ్రీ నెంబర్ 155235 కి గానీ ఫిర్యాదు చేయొచ్చు.


మరింత సమాచారం తెలుసుకోండి: