వైసీపీ మంత్రులకు కనీస పరిజ్ఞానం లేదని.. ఇలాంటి మంత్రులు ఉండటం పల్నాడు జిల్లా కు సిగ్గు చేటు అని టీడీపీ నేత కోడెల శివరామ్ అన్నారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో తాలుకా సెంటర్లో టీడీపీ నేత కోడెల శివరామ్ ఆత్మ గౌరవ దీక్ష చేపట్టారు. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరును మార్చటాన్ని వ్యతిరేకిస్తూ నిరసనగా కోడెల దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా టిడిపి నేత కోడెల శివరాం వైసీపీ మంత్రులపై ఘాటుగా కామెంట్స్ చేశారు.

టాబ్లెట్ కు -టానిక్ కు తేడా తెలియని వారు వైద్యశాఖ మంత్రి అని.. కాలువ కు - నదికి తేడా చెలియని వ్యక్తి జలవనరుల శాఖ మంత్రి అని.. ఇలాంటి మంత్రులు ఉండటం పల్నాడు జిల్లా కు సిగ్గు చేటు అని కోడెల శివరామ్ అన్నారు. కోడెల శివ ప్రసాద్ వైద్య శాఖ మంత్రి గా ఎన్నో మెడికల్ కాలేజీలు తీసుకువచ్చారని.. కానీ వైసిసి ప్రభుత్వం వైద్య రంగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసిందని ఆయన విమర్శించారు. టిడిపి ప్రభుత్వంలో నిర్మించిన ఎయిమ్స్ కు కనీసం నీళ్లు ఇవ్వలేని దుస్దితి ఉందని మండిపడ్డారు.


మరింత సమాచారం తెలుసుకోండి: