అమరావతిలోని ఎస్ ఆర్ ఎం విశ్వవిద్యాలయానికి వెళ్లే రహదారి మరీ అధ్వాన్నంగా ఉండటంతో విద్యార్థులు, తల్లిదండ్రులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆర్ అండ్ బీ ముఖ్య కార్యదర్శి కి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ లేఖ రాసారు. తక్షణ మరమ్మతులు చేయాలని నారా లోకేశ్‌ డిమాండ్ చేశారు. సామాజిక, సాంస్కృతిక మార్పులకు మార్పులో రహదారుల అభివృద్ధి ఎంతో కీలకమని లోకేశ్‌ లేఖలో పేర్కొన్నారు.


రాష్ట్రంలో గత 3ఏళ్లుగా రోడ్ల పరిస్థితి మరీ అధ్వానంగా ఉందని నారా లోకేష్  ధ్వజమెత్తారు. రాజధాని ప్రాంతమైన అమరావతిలోని ఎస్‌ఆర్‌ఎం యూనివర్శిటీకి వెళ్లే రహదారుల దారుణమైన పరిస్థితి గురించి ప్రత్యేకంగా తమ దృష్టికి తీసుకురావాలనుకుంటున్నానన్నారు. 2017లో  స్థాపించిన యూనివర్సిటీకి వెళ్లే రోడ్ల దయనీయ స్థితి ఆవేదన కలిగిస్తోందన్నారు. విద్యార్థులు, తల్లిదండ్రులు రహదారుల దుస్థితిపై తనకు అనేక ఫిర్యాదులు అందచేశారు. ఆ మార్గంలో రవాణా పెను సవాలుగా మారిందని వారంతా ఆందోళన చెందుతున్నారన్నారు. తరచూ ప్రమాదాలు, వాహనాలు దెబ్బతినడం వంటి సంఘటనలు చోటు చేసుకుంటున్నాయని వెల్లడించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: