విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ విక్రయంపై ఐక్య పోరాటానికి రంగం సిద్ధమైంది.  నూరు శాతం అమ్మేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయానికి వ్యతిరేకంగా పోరాటం ఉధృతం కానుంది.  దేశ ప్రధాని విశాఖ వస్తున్నసందర్భంగా ప్రజల వ్యతిరేకత నిరసన తెలిపేందుకు కార్యాచరణ ఖరారైంది. విశాఖ అఖిల పక్ష కార్మిక ప్రజా సంఘాల ఐకాస అధ్వర్యంలో జరిగిన సమావేశంలో నిర్ణయించారు.  కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలనే ఉద్దేశంతో విశాఖపట్నంలోని కార్మికులు,  వివిధ తరగతుల ప్రజానీకం ఈ నెల 9 నుండి 12 వరకు వివిధ రూపాలలో నిరసన ప్రదర్శనలు చేయాలని నిర్ణయించాయి.


తమకు ప్రభుత్వం వీటికి అండగా నిలవాలని  సమావేశం విజ్ఞప్తి చేసింది. స్టీల్ ప్లాంట్ కార్మికులు, ఇతర తరగతుల ప్రజానీకం నిర్వహించే నిరసన కార్యక్రమాలకు ఎటువంటి ఆటంకాలు పోలీసులు సృష్టించవద్దని కోరింది. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అమ్మాలనే కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా కార్మికులు రాష్ట్ర ప్రజలు పెద్ద ఎత్తున పోరాడుతున్నారని,  స్టీల్ ప్లాంట్ కార్మికులు,  విశాఖపట్నం ప్రజలు  కేంద్ర ప్రభుత్వ నిర్ణయం వెలువడినప్పటి నుండి గత 630 రోజులకు పైగా నిరాహార దీక్షలు చేస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: