గవర్నర్ పదవి తరచూ వివాదాస్పదం అవుతోంది. గవర్నర్ ని ఉపయోగించి కేంద్రం రాష్ట్ర ప్రభుత్వంలను భయపెడుతోందన్న ఆరోపణలు వస్తున్నాయి. గవర్నర్ లతో బీజేపీ తన అజెండాని అమలుపరుస్తుందని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా ఆరోపించారు. అసలు గవర్నర్ పోస్ట్ అవసరమా అనే చర్చ చేశామన్న ఆయన.. రాష్ట్ర ప్రభుత్వాలలో గవర్నర్ జోక్యం చేస్కోవడం సరికాదన్నారు.


రాజ్యాంగం, డెమోక్రాసి కాపాడటం కోసం సెక్యులర్ శక్తులు అన్నీ ఏకం కావాలని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా పిలుపు ఇచ్చారు. జాతీయ స్థాయిలో భాజపా ఓటమికి కలిసి వచ్చే పార్టీలతో పని చేస్తామని.. రాష్ట్రాలలో కూడా అలాంటి శక్తులతో కలుస్తామని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా అన్నారు.  తెరాస ఇతర పార్టీలతో సంబంధాలు కొనసాగుతాయని.. కాంగ్రెస్ పాన్ ఇండియన్ సెక్యులర్ పార్టీ అని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా చెప్పారు. కాంగ్రెస్ తో కలిసి పని చేస్తామన్న సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా.. ఎన్నికలలో ఎలా వెళ్ళాలి అనేది రాష్ట్ర కమిటీలు నిర్ణయం తీసుకుంటారన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: