గుజరాత్ లోని నరేంద్ర మోదీ పేరుతో ఓ స్టేడియం ఉన్న సంగతి తెలిసిందే. ఈ నరేంద్ర మోదీ స్టేడియం సామర్థ్యం లక్షా 10వేల సీట్లు. ఒక్కమాటలో చెప్పాలంటే.. ఇది మెల్ బోర్న్ క్రికెట్ గ్రౌండ్ సామర్థ్యం కన్నా 10వేలు ఎక్కువ సామర్థ్యం ఉందన్నమాట. అలాంటి నరేంద్ర మోదీ స్టేడియం తాజాగ గిన్నిస్ బుక్ లో చోటు సంపాదించింది.

ఎందుకంటే.. 2022 ఐపీఎల్  ఫైనల్  మ్యాచ్ లో అత్యధికంగా ఈ నరేంద్ర మోదీ స్టేడియంలో  లక్షా ఒక వెయ్యి 566 మంది ప్రేక్షకులు కూర్చొన్నారు. ఇలా అత్యధికంగా  హాజరైనందుకు  ఈ నరేంద్ర మోదీ స్టేడియం  గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో చేరింది. ఈ మేరకు తెలిపిన బీసీసీఐ కార్యదర్శి జై షా సోషల్ మీడియాలో పోస్టు చేశారు. నరేంద్ర మోదీ స్టేడియం గిన్నిస్  రికార్డు సాధించడం అందరికీ గర్వకారణమని  జై షా పేర్కొన్నారు. భారత అభిమానులకు  వారి అసమానమైన అభిరుచికి అభినందనలని బీసీసీఐ కూడా పోస్టు చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: