ఏపీ సీఎం జగన్ ఓ గుడ్‌న్యూస్ చెప్పారు. జనవరి 1, 2023నుంచి వృద్దాప్య పెన్షన్‌ పెరగబోతోంది. ఇకపై వారికి పెన్షన్‌ రూ.2750 అందుతుంది. ముఖ్యమంత్రి వైయస్‌.జగన్‌ అధ్యక్షతన రాష్ట్ర మంత్రిమండలి స‌మావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. వివిధ కారణాల వల్ల మిగిలి పోయిన, కొత్తగా అర్హత సాధించిన లబ్ధిదారులకు ఏడాదికి రెండు దఫాలుగా లబ్ధి చేకూరనుంది.

ఇప్పటి వరకూ రూ. 2,500 ఉన్న పెన్షన్‌ను వచ్చే నెల నుంచి రూ. 2,750కి పెన్షన్‌ పెంచుతూ ఏపీ కేబినెట్‌ నిర్ణయం తీసుకుంది. దీనివల్ల 62. 31 లక్షల మంది పెన్షన్‌దారులకు మేలు జరుగుతుంది. జనవరి 1వ తేదీ నుంచి ఈ కొత్త  పెన్షన్‌ను అమలు అవుతుంది. అలాగే వైయ‌స్ఆర్ పశుబీమా పథకం ప్రతిపాదనలకు ఏపీ కేబినెట్‌ ఆమోదం తెలిపింది. అన్ని ప్రభుత్వ పాఠశాల్లలో వర్చువల్‌ క్లాస్‌లు, ఫౌండేషన్‌ స్కూళ్లలో స్మార్ట్‌ టీవీ రూమ్‌లను నాడు-నేడు ద్వారా నిర్మించే ప్రతిపాదన కు కూడా  కేబినెట్‌ ఓకే చెప్పేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: