భారత్ రాష్ట్ర సమితి ఎజెండా ఏంటనే సందేహాలను కేసీఆర్ పటాపంచలు చేశారు. రైతుల సమస్యే తమ పార్టీ ఎజెండా అని స్పష్టం చేశారు. తెలంగాణలో జరిగిన అభివృద్ధినే దేశవ్యాప్తంగా చేస్తామని ప్రచారం చేస్తున్నారు. తెలంగాణలో వానాకాలం, యాసంగి సీజన్లకు ఎకరానికి 5 వేలు ఇచ్చామని తెలిపారు. తెలంగాణలో సాగుకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నామన్నారు. ధాన్యం కొనుగోళ్లు, మిషన్ కాకతీయతో కాల్వల పునరుద్ధరణ, ఇరిగేషన్ ప్రాజెక్టుల ఆధునికీకరణ గురించి దేశవ్యాప్తంగా తెలిసేలా ప్రచారాలు చేస్తున్నారు.


రైతులతోనే అభివృద్ధి సాధ్యమనే పాయింట్ తో జనాల్లోకి వెళ్లేందుకు చూస్తున్నారు. పార్టీ అనుబంధ రైతు సంఘంగా భారత్‌ రాష్ట్ర కిసాన్‌ సమితిని ప్రకటించారు. దానికి ప్రెసిడెంట్ గా హర్యానాకు చెందిన రైతు సంఘం నేత గుర్నామ్ సింగ్ తో తొలి సంతకం చేయించారు. మరోవైపు పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లో రైతులే అధికంగా ఉన్నారు. దీన్ని బట్టి చూస్తే.. వ్యవసాయ రంగమే తమ ప్రాధాన్యం అని ఉత్తరాది రాష్ట్రాలను ఆకట్టుకునేందుకు యత్నిస్తున్నారు కేసీఆర్.

మరింత సమాచారం తెలుసుకోండి: