సైద్దాంతిక భావాలుండి పార్టీని వీడిన వారంతా తిరిగి భాజపాలోకి రావాలని తెలంగాణ బీజేపీ రాష్ర్ట అధ్యక్షుడు బండి సంజయ్‌ పిలుపు ఇస్తున్నారు. అందరం కలిసి కేసీఆర్ నియంత పాలనపై పోరాడుదామని బీజేపీ రాష్ర్ట అధ్యక్షుడు బండి సంజయ్‌ అంటున్నారు. భాజపా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ప్రజాస్వామిక తెలంగాణను సాధించుకుందామని బీజేపీ రాష్ర్ట అధ్యక్షుడు బండి సంజయ్‌ పిలుపునిస్తున్నారు. రాజకీయాల్లో ప్రసంశల కంటే విమర్శలే ఎక్కువగా ఉంటాయన్న బండి సంజయ్‌... పదవులు ముఖ్యం కాదు ప్రజలకు సేవ చేయాలనే లక్ష్యంతో ముందుకు నడిస్తున్నట్లు చెప్పారు. తెలంగాణ పేరుతో వచ్చి కేసీఆర్ కుటుంబం దోచుకుంటుందని బీజేపీ రాష్ర్ట అధ్యక్షుడు బండి సంజయ్‌ దుయ్యబట్టారు. ఊపిరి ఉన్నంత వరకు తెలంగాణ ప్రజల మేలు కోసం పని చేస్తానని బండి సంజయ్‌ స్పష్టం చేశారు. తెలంగాణ అస్థిత్వాన్ని కాపాడేందుకు నేతలు ఎంతో పోరాటం చేస్తున్నారని భాజపా వ్యవహారాల ఇంచార్జీ తరుణ్‌ చుగ్‌ కొనియాడారు. తెలంగాణ ఉద్యమకారులను భారాస వాడుకుని వదిలేసిందని ఆయన అన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: