నెల్లూరు జిల్లాలో సముద్రంలో చిక్కుకున్న 9 మంది ప్రాణాలను కావలి రూరల్ పోలీసులు కాపాడారు. కావలి రూరల్ మండలంలోని చెన్నాయపాలెం సముద్ర తీరంలో పడవలో సరదాగా తిరుగుదామనుకొని వెళ్లిన ముసునూరుకు చెందిన 9 మంది యువకులు  సముద్రంలో చిక్కుకుపోయారు. మధ్యాహ్నం ఫైబర్ పడవను మాట్లాడుకొని ఒకటిన్నర కిలోమీటర్ వెళ్లిన తరువాత పడవ మోటార్ చెడిపోయింది. దిక్కు తోచని స్థితిలో ఏమి చేయాలో అర్ధం కాక 112 కు యువకులు కాల్ చేశారు.


సమాచారం అందుకున్న కావలి రూరల్ పోలీసులు హుటాహుటిన సముద్ర తీరానికి చేరుకుని.. మరో బోటులో బాధితుల వద్దకు చేరుకొని భరోసా కల్పించి, క్షేమంగా ఒడ్డుకు చేర్చారు. దీంతో 9 మంది బాధితులు ఆనందభాష్పలతో కృతజ్ఞతలు తెలిపారు. ఈ ఆపరేషన్ లో కావలి DSP వెంకటరమణ, కావలి రూరల్ CI రాజేష్, ఎస్సై వీరేంద్ర బాబు పాల్గొనగా వారిని  జిల్లా యస్.పి. అభినందించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

sea