వైసీపీ అధికారంలోకి వ‌చ్చిన తర్వాత నాలుగేళ్లలో సాధించిన వృద్ధి ఇదీ అంటూ అధికారులు లెక్కలు తేల్చారు. ఇటీవల జరిగిన ఓ సమీక్షలో సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌కు అధికారులు ఈ లెక్కలు వివ‌రించారు. స్థిరధరల సూచీ ప్రకారం 2019లో రాష్ట్రం ఏపీ జీడీపీ వృద్ధి 5.36శాతంగా ఉందని..  ఇది దేశ సగటు 6.5శాతం కన్నా తక్కువ అని అధికారులు వివరించారు. అయితే.. గడచిన నాలుగేళ్లలో మంచి ప్రగతి ఉందని అధికారులు వెల్లడించారు.


2021-22లో రాష్ట్ర జీఎస్‌డీపీ గ్రోత్‌ రేట్‌ 11.43శాతానికి పెరిగిందని అధికారులు వివరించారు. ఈజ్‌ ఆఫ్ డూయింగ్‌ బిజినెస్‌లో వరుసగా నంబర్‌ ఒన్‌ స్థానంలో నిలుస్తున్నామని అధికారులు వివ‌రించారు. 2022-23లో జీడీఎస్‌డీపీలో గ్రోత్‌ రేట్‌ 16.22 శాతంగా ఉందని ఏపీ అధికారులు సీఎం జగన్‌కు వెల్లడించారు. అంతే కాదు.. జీడీఎస్‌డీపీలో రాష్ట్ర పారిశ్రామిక రంగం దాదాపు రూ.13లక్షల కోట్ల వాటా కలిగి ఉందన్నారు. పారిశ్రామికరంగం వాటా 21శాతం నుంచి 23శాతానికి పెరిగిందని సీఎం జగన్‌కు అధికారులు వివ‌రించారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: