తెలంగాణలో అందరు కలిసి పని చేస్తే కర్ణాటక రాష్ట్రంలో మాదిరి కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చి తీరుతుందని ఆ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ అంటున్నారు. డీకే శివకుమార్‌ను భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పీసీసీ ప్రధాన కార్యదర్శి అనిరుద్ద్‌ రెడ్డి నిన్న మర్యాదపూర్వకంగా కలిశారు. ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి బెంగుళూరులో డీకే శివకుమార్‌ను కలిసిన సందర్భంగా వారి మధ్య దాదాపు 45 నిముషాలుపాటు తెలంగాణలోని తాజా రాజకీయ అంశాలపై చర్చ జరిగింది.

ప్రధానంగా టిక్కెట్లు, సర్వేలు, గెలుపు గుర్రాలు ఎంపిక, షర్మిళ కాంగ్రెస్‌ పార్టీలోకి చేర్చుకోవడం తదితర అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది.  షర్మిళ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లకు సంబంధం లేదని, ఆ దృష్టితో చూడొద్దని ఆమె తెలంగాణ కోడలు, వై.ఎస్‌ఆర్‌ బిడ్డగానే చూడాలని డీకే శివకుమార్‌ అభిప్రాయపడినట్లు తెలిసింది. కర్ణాటకలో అభ్యర్ధుల ఎంపిక విషయంలో ఒక్కో అభ్యర్ధిపై మూడు మార్లు సర్వేలు చేయించిన తరువాతనే అభ్యర్ధుల జాబితా ప్రకటించారని డీకే శివకుమార్‌ అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: