14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు.. సీమకు ఏమీ చేయలేదని వైసీపీ నేతలు మండిపడుతున్నారు. వైయస్‌ రాజశేఖరరెడ్డి 5 సంవత్సరాల మూడు నెలలు.. వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి నాలుగు సంవత్సరాల నాలుగు మాసాలు ముఖ్యమంత్రిగా ఉన్నారని.. వీళ్లద్దరి కన్నా ఎక్కువ కాలం ముఖ్యమంత్రిగా పని చేసిన చంద్రబాబు ఏం సాధించారని వారు నిలదీస్తున్నారు.

రాయలసీమలో పోతిరెడ్డిపాడు,ఎస్‌ఎన్‌ఎస్, గాలేరు–నగరి ప్రాజెక్టులు ఉన్నా... వీటిలో చంద్రబాబు ఒక్కటైనా ప్రారంభించారా అని ప్రశ్నిస్తున్నారు. ఎన్టీ రామారావు ఈ ప్రాజెక్టులను డిజైన్‌ చేశారని.. ఎన్టీఆర్‌ డిజైన్‌ చేస్తే..చంద్రబాబు ఎన్టీఆర్‌ను ఎలా ముంచారో..ఈ ప్రాజెక్టులను కూడా చంద్రబాబు అలాగే ముంచేశారని విమర్శిస్తున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తాను ముఖ్యమంత్రిగా ఉన్న 9 ఏళ్లు ఈ ప్రాజెక్టులకు ఒక్క పైసా కూడా ఖర్చు పెట్టలేదని.. వాటిని  మూలనపడేశారని గుర్తు చేస్తున్నారు. వైయస్‌ రాజశేఖరరెడ్డి సీఎం అయ్యాకే మళ్లీ ఈ ప్రాజెక్టులకు ప్రెస్‌గా జీవోలు ఇచ్చి ప్రారంభించారని మంత్రి అంబటి గుర్తు చేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి: